Devara : సెకెండ్‌ సింగిల్‌..  నీ కోసం వయసు వాకిలి కాసా!

ABN , Publish Date - Aug 05 , 2024 | 05:35 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌(NTR), జాన్వీ కపూర్‌(Janhvi kapoor) జంటగా నటిస్తున్న 'దేవర' (Devara) చిత్రంలోని సెకెండ్‌ సింగిల్‌ను సోమవారం సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌(NTR), జాన్వీ కపూర్‌(Janhvi kapoor) జంటగా నటిస్తున్న 'దేవర' (Devara) చిత్రంలోని సెకెండ్‌ సింగిల్‌ను సోమవారం సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది. 'చుట్టమల్లే చుటేస్తాంది.. తుంటరి చూపు.. ఉరికే ఉండదు కాసేపు’ అంటూ సాగే పాటను అనిరుద్‌ సంగీత సారధ్యంలో శిల్పారావు ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి పార్ట్‌ను సెప్టెంబర్‌ 27న పాన్ ఇండియా  స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. 

Updated Date - Aug 05 , 2024 | 05:35 PM