Devara - Dop Ratnavelu: ఎన్టీఆర్‌ గ్రేస్‌, స్టైల్‌ మామూలుగా లేవు..  పూనకాలు పక్కా

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:42 PM

ఎన్టీఆర్‌(NTR) హీరోగా నటిస్తున్న ‘దేవర’(Devara) చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమా షూట్‌కు సంబంధించి సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు(Dop Ratnavelu) ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు.

ఎన్టీఆర్‌(NTR) హీరోగా నటిస్తున్న ‘దేవర’(Devara) చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమా షూట్‌కు సంబంధించి సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు(Dop Ratnavelu) ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. సెట్‌లో దిగిన ఫొటో షేర్‌ చేసిన ఆయన .. ‘‘ఈ చిత్రంలోని ఓపెనింగ్‌ సాంగ్‌ షూట్‌ చేస్తున్నాం. అద్భుతమైన విజువల్స్‌.. అనిరుధ్‌ మ్యూజిక్‌తో ఇది చాలా చక్కగా సిద్థమవుతోంది. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌ గ్రేస్‌, స్టైల్‌ మామూలుగా లేవు. ఫాన్స్‌కు పూనకాలు పక్కా’’ (punakaalu pakka) అని పేర్కొన్నారు.
ఈ పాటకు ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారని ఆయన అన్నారు. రత్నవేలు పోస్ట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సినిమా కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

‘జనతా గ్యారేజ్‌’ సక్సెస్‌ తర్వాత హీరో ఎన్టీఆర్‌- డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. జాన్వీ కపూర్‌ ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దేవర’ పార్ట్‌ 1 సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఇటీవల ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ విడుదలైంది. ‘చుట్టమల్లే’ అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్‌ - జాన్వీకపూర్‌పై చిత్రీకరించారు. ఈ ఈ పాటకు యూట్యూబ్‌లో దాదాపు 45 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. 

Updated Date - Aug 11 , 2024 | 04:42 PM