Jai Jawan: ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ ‘జై జవాన్’ ట్రైలర్ వదిలిన మలినేని గోపీచంద్

ABN , Publish Date - Aug 16 , 2024 | 12:28 AM

సంతోష్‌ కల్వచెర్ల హీరోగా, పావని రామిశెట్టి హీరోయిన్‌గా.. తనికెళ్ల భరణి, సత్యప్రకాష్‌, నాగినీడు, విజయ రంగరాజు, అప్పాజీ అంబరీష్‌, బిహెచ్‌ఇఎల్‌ ప్రసాద్‌, బలగం సంజయ్‌, బాల పరసార్‌, సంజన చౌదరి ముఖ్యతారలుగా రూపొందిన ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ ‘జై జవాన్‌’. నాగబాబు పోటు దర్శకత్వంలో కేఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఈశ్వరీ కుమారి సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్‌ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని గోపీచంద్ మలినేని రిలీజ్ చేశారు.

Jai Jawan Movie Trailer Launch event

సంతోష్‌ కల్వచెర్ల హీరోగా, పావని రామిశెట్టి హీరోయిన్‌గా.. తనికెళ్ల భరణి, సత్యప్రకాష్‌, నాగినీడు, విజయ రంగరాజు, అప్పాజీ అంబరీష్‌, బిహెచ్‌ఇఎల్‌ ప్రసాద్‌, బలగం సంజయ్‌, బాల పరసార్‌, సంజన చౌదరి ముఖ్యతారలుగా రూపొందిన ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ ‘జై జవాన్‌’ (Jai Jawan). నాగబాబు పోటు దర్శకత్వంలో కేఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఈశ్వరీ కుమారి సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్‌ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశభక్తి నేపథ్యంలో దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలియజేసే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కాన్సెప్ట్‌ నచ్చి ఈ చిత్ర ట్రైలర్‌ను ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు.

ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ఈ చిత్ర కాన్సెప్ట్‌ నాకు నచ్చింది. ఈ ట్రైలర్‌ చూస్తుంటే దేశభక్తి నేపథ్యంలో రూపొందిన గొప్ప చిత్రంలా ఈ సినిమా వుండబోతుందని, ఇలాంటి ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ విజయం సాధించాలని, ఈ సినిమా ద్వారా ఈ టీమ్‌ అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. (Jai Jawan Trailer Released)

Also Read- Thangalaan Review: ‘బంగారం’లాంటి సినిమా..


చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సైనికుడి గొప్పతనం గురించి తెలియజేశాం. సంతోష్‌ కల్వచెర్ల హీరోగా చక్కని ప్రతిభను కనపరిచాడు. ఆయనకు హీరోగా మంచి భవిష్యత్‌ వుంది. మా ట్రైలర్‌ను ఆవిష్కరించి,మాకు విషెస్‌ అందజేసిన గోపీచంద్‌ మలినేని ధన్యవాదాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు కూడా పాల్గొన్నారు.

‘జై జవాన్‌’ ట్రైలర్‌ విషయానికి వస్తే.. దేశభక్తి వున్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా, సైనికులు ఈ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘ప్రాణం తీసే ఆయుధాలంటే భయం లేదు నాకు... చావు కోరే శత్రువులంటే కోపం రాదు’ అంటూ తనికెళ్ల భరణి చెప్పిన సంభాషణ.. ‘జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని, జీవితాన్నిచ్చిన మాతృభూమి రుణాన్ని తీర్చుకునేది ఒక జవాన్‌ మాత్రమే’ అని సాయికుమార్‌ చెప్పిన డైలాగులు వింటూంటే గూస్‌బంప్స్‌ వచ్చే విధంగా వున్నాయి. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Aug 16 , 2024 | 12:28 AM