Konda Surekha అమల వ్యాఖ్యలను ఖండించిన  ఎంపీ 

ABN , Publish Date - Oct 03 , 2024 | 01:15 PM

మంత్రి కొండా సురేఖ (Surekha) చేసిన సంచలన వ్యాఖ్యలతో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి కడిగి పారేస్తున్నారు. అలాగే నాగ్ కుటుంబం (Nagarjuna)కూడా ఈ కామెంట్స్‌పై సీరియస్ కౌంటర్ ఇచ్చారు.

మంత్రి కొండా సురేఖ (Surekha) చేసిన సంచలన వ్యాఖ్యలతో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి కడిగి పారేస్తున్నారు. అలాగే నాగ్ కుటుంబం (Nagarjuna)కూడా ఈ కామెంట్స్‌పై సీరియస్ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అక్కినేని అమల చేసిన ట్వీట్ పొలిటిషియన్లకు కోపం తెప్పిస్తోంది. దీంతో కొందరు నాయకులూ డైరెక్ట్‌గానే అమలపై సీరియస్ అవుతున్నారు. ఇంతకీ ఎం జరిగిందంటే..


‘‘ఒక మహిళా మంత్రి రాక్షసంగా మారడం.. చెడుగా కల్పిత ఆరోపణలను చేయడం, వారి రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలోని పౌరులను వాడుకోవడం నాకు దిగ్భ్రాంతిని కలిగించింది. మంత్రి గారు.. మీకు సిగ్గుగా లేదా.. ఎలాంటి వాస్తవాలు లేకుండా నా భర్త గురించి పూర్తిగా అసత్య కథనాలను ప్రచారం చేయడం నిజంగా సిగ్గుచేటు. నాయకులు నేరస్తులలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? మిస్టర్ రాహుల్ గాంధీజీ.. మీరు వ్యక్తుల గౌరవమర్యాదలను విశ్వసిస్తే, దయచేసి మీ రాజకీయ నాయకులను అదుపులో ఉంచుకోండి. మీ మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పి ఆమె విషపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా తక్షణమే చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి..’’ అంటూ అమల అక్కినేని ఘాటుగా చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు (Mallu Ravi) రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొలిటీషియన్స్ పై అమల చెడు వ్యాఖ్యలు చేయడం, రాహుల్ గాంధీ (Rahul Gandhi) హ్యుమానిటీ గురించి ప్రశ్నించడం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని అన్నారు. పొలిటీషియన్స్‌పై, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను అమల ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొండా సురేఖ ఒక బీసీ మహిళ.. తన ఆత్మగౌరవం, గౌరవాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొత్తం ఈ ఘటనకుగల మెయిన్ రీజన్‌పై ఫోకస్ చేయాలనీ పిలుపునిచ్చారు. అలాగే బీఆర్ఎస్ నాయకులూ సురేఖపై చేసిన ట్రోలింగ్స్ కారణంగా ఆమె ఎంత మనోవేదనకు గురై ఇలా మాట్లాడి ఉంటారని సమర్ధించారు.

Updated Date - Oct 03 , 2024 | 01:29 PM