ఒక్క రాత్రిలో జరిగే కథ

ABN , Publish Date - Sep 26 , 2024 | 01:10 AM

ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘96’తో అందరినీ విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘సత్యం సుందరం’. కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. సూర్య, జ్యోతిక నిర్మించారు...

ఒక్క రాత్రిలో జరిగే కథ

ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘96’తో అందరినీ విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘సత్యం సుందరం’. కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ నెల 28న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌ మీడియాతో ముచ్చటించారు. ‘‘ఇదో బ్యూటిఫుల్‌ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమాకు కార్తి, అరవింద్‌ స్వామి బిగ్గెస్ట్‌ స్ట్రెంగ్త్‌. వారిద్దరూ అంగీకరించకుంటే.. ఈ ప్రాజెక్ట్‌ను మొదలెట్టేవాణ్నే కాదు. ఇది ఒక్క రాత్రిలో జరిగే కథ. సక్సెస్‌ను, ఫెయిల్యూర్‌ని నేను పట్టించుకోను. సినిమా చేసేటప్పుడు వచ్చే సంతృప్తి మాత్రమే ముఖ్యం. ఈ సినిమా విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. ప్రొడ్యూసర్స్‌ సూర్య, జ్యోతిక మేకింగ్‌ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. టెక్నికల్‌గా సినిమా ఉన్నతంగా ఉంటుంది. గోవింద్‌ వసంత ఇచ్చిన సంగీతం అద్భుతంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా అలరించే సినిమా ఇది’’ అని చెప్పారు.

Updated Date - Sep 26 , 2024 | 01:10 AM