క్యారెక్టర్‌ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:20 AM
‘స్ట్రాంగ్ మ్యాన్ డోంట్ హ్యావ్ ఆటిట్యూడ్..దే హ్యావ్ క్యారెక్టర్ అని ‘దిల్ రూబా’లో సిద్ధు డైలాగ్ చెబుతాడు. క్యారెక్టర్‌ను నమ్ముకున్న ప్రతీ ఒక్కరికీ మా సినిమా నచ్చుతుంది’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ‘క’ చిత్రం తరవాత కిరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రిల్ రూబా’....
‘స్ట్రాంగ్ మ్యాన్ డోంట్ హ్యావ్ ఆటిట్యూడ్..దే హ్యావ్ క్యారెక్టర్ అని ‘దిల్ రూబా’లో సిద్ధు డైలాగ్ చెబుతాడు. క్యారెక్టర్‌ను నమ్ముకున్న ప్రతీ ఒక్కరికీ మా సినిమా నచ్చుతుంది’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ‘క’ చిత్రం తరవాత కిరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను చేసిన సిద్దు, సిద్ధార్ట్ క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా ఉంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి ఉంటాడు. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది’ అని అన్నారు. చిత్రదర్శకుడు విశ్వకరణ్ మాట్లాడుతూ ‘మనందరి జీవితాల్లో ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని చేశా’ అని అన్నారు. నిర్మాత రవి మాట్లాడుతూ ‘ కిరణ్ అబ్బవరంను ఇప్పటి వరకు చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు’ అని చెప్పారు.