ఆధ్యాత్మికత ఉట్టిపడేలా...

ABN , Publish Date - Jan 05 , 2025 | 06:24 AM

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘బుజ్జి తల్లి’ని...

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘బుజ్జి తల్లి’ని విడుదల చేశారు. శనివారం రెండో పాట ‘నమో నమః శివాయ’ను విడుదల చేశారు. కళాత్మకత..ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉన్న ఈ శివ శక్తి పాటను జొన్నవిత్తుల రచించగా.. అనురాగ్‌ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదల కానుంది. కాగా, నాగచైతన్య, సాయిపల్లవి కలసి నటిస్తున్న రెండో చిత్రమిది. 2021లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌ స్టోరీ’ సినిమాలో మొదటిసారి కలసి నటించారు.

Updated Date - Jan 05 , 2025 | 06:24 AM