Pan Indian Movies 2025: ఈ ఏడాది పాన్ ఇండియా నామ సంవత్సరం

ABN , Publish Date - Jan 04 , 2025 | 06:28 AM

ప్రతి సంవత్సరం రిలీజ్ అయినట్లే ఈ సారి కూడా పాన్ ఇండియా సినిమాల జోరు కనిపించనుంది. అయితే వీటి ఎఫెక్ట్ తెలుగు సినిమాలపై పడే అవకాశముందని సినీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అదేంటి తెలుగులో పాన్ ఇండియన్స్ సినిమాస్ రావడం లేదా అంటే.. వస్తున్నాయి. కానీ..

Yash's next toxic

ఈ ఏడాది కూడా అన్నీ భాషా చిత్రాలు మనవద్ద.. మన సినిమాలు అన్నీ భాషల్లో విడుదలకానున్నాయి. అన్నీ భాషాల్లోని అగ్ర హీరోలు ఈ ఏడాది తమ కెరీర్ లో క్రేజీ సినిమాలు చేస్తున్నారు. రజినీకాంత్ 'కూలీ' , కమల్ హాసన్ 'థంగ్ లైఫ్', విజయ్ '69', మోహన్ లాల్ 'ఎల్ 2 ఎంపురన్' , యష్ 'టాక్సిక్'తో పాటు బాలీవుడ్ నుంచి కూడా 'వార్ 2' లాంటి సినిమాలు తెలుగులో కూడా భారీ రిలీజ్ కు సిద్ధమయ్యాయి.

తెలుగు సినిమాలపై ఎఫెక్ట్

ఇలాంటి సినిమాల నేపథ్యంలో తెలుగు సినిమాల రిలీజ్ పై వీటి ఎఫెక్ట్ పడనుంది. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాలు కొన్ని ఉన్నా.. చిన్న మీడియం బడ్జెట్ సినిమాల విడుదలపై మేకర్స్ కు ఏం చేయాలో తోచని పరిస్దితి నెలకొంది. నాని , అడవి శేష్ లాంటి వారు తమ సినిమాలను పాన్ ఇండియా వైడ్ విడుదలకు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. వీరితోపాటు పలువురు యువ హీరోలు నటించిన, నటిస్తున్న సినిమాలకు స్పెస్ ఉంటుందా అనే చర్చ మొదలైంది.

ఆల్రెడీ రెడీ అయిన రాబిన్ హుడ్ లాంటి సినిమాలే 'పుష్ప 2' రన్ కొసం లాస్ట్ మినిట్ లో విడుదల వాయిదా వెసుకున్న సిట్యువేషన్ చూశాం. ఇక కొన్ని కారణాల వల్ల త్వరలో రాబోతున్న నాగచైతన్య తండేల్ కూడా రిలీజ్ ఉంటుందా అని అనుమానాలు నెలకొన్న తరుణంలో అల్లు అరవింద్.. డేట్ మిస్ అయితే మళ్లీ దొరికే పరిస్దితి లేదని ఫిబ్రవరి 7 నే ఈ సినిమాను విడుదల చేసెందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి ఈ ఏడాది స్టార్ హీరోలను మినహాయిస్తే.. మిగిలిన హీరోలకు సరైన రిలీజ్ డేట్ దొరకటమనేది కష్టమే అని వార్తలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jan 04 , 2025 | 06:36 AM