Vishal: గుర్తుపట్టలేని స్థితిలో హీరో విశాల్.. ఏమైందంటే
ABN , Publish Date - Jan 05 , 2025 | 09:43 PM
హీరో విశాల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన వేదికపై మాట్లాడుతుంటే చేతులు వణుకుతున్నాయి. చాలా నిదానంగా మాట్లాడుతున్నారు. సరిగ్గా నడవలేకపోయారు. చాలామంది ఆయనను పరామర్శించడం కూడా కనిపించింది.
తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని తమిళ హీరో విశాల్. ఆయన తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మనిషి. అలాగే తన పొలిటికల్, సినీ స్టాండ్స్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు. జెట్ స్పీడ్ లో సినిమాలు తీస్తూ నిర్మాతలు హాట్ ఫెవరెట్ హీరోగా నిలుస్తూ వస్తున్నారు.
తాజాగా ఆయన లేటెస్ట్ ఫిల్మ్ మదగజరాజ సినిమా ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు. అలాగే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన వేదికపై మాట్లాడుతుంటే చేతులు వణుకుతున్నాయి. చాలా నిదానంగా మాట్లాడుతున్నారు. సరిగ్గా నడవలేకపోయారు. చాలామంది ఆయనను పరామర్శించడం కూడా కనిపించింది. అయితే విశాల్ హై ఫీవర్, జలుబుతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, మదగజరాజ మూవీ 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకొగా.. 12 ఏళ్ల అనంతరం ఇప్పుడు రిలీజ్ అవుతోంది.