Poonam Kaur: త్రివిక్రమ్ వెనుక పెద్ద మనుషులు.. అందుకే అన్యాయం
ABN , Publish Date - Jan 05 , 2025 | 05:36 PM
Poonam Kaur: అతనొక మోసగాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు మండిపడింది. గతంలో పవన్‌కల్యాణ్‌కు, పూనమ్‌కు మధ్య సంబంధం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో త్రివిక్రమ్ చురుగ్గా వ్యవహరించాడని కూడా వార్తలు వచ్చాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో (Trivikram) హీరోయిన్ పూనమ్ కౌర్‌కు (poonam kaur) మధ్య కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా గొడవ నడుస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమె త్రివిక్రమ్‌పై విరుచుకుపడుతుంది. తాజాగా మరోసారి ఆమె ట్విట్టర్ వేదికగా త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
'‘త్రివిక్రమ్‌పై గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA)లో ఫిర్యాదు చేశా. అయితే ఆయన వెనక ఉన్న పెద్ద మనుషుల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నా ఆరోగ్యం, ఆనందాన్ని ప్రభావితం చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు" అంటూ మండిపడింది.
అయితే గతంలో కూడా త్రివిక్రమ్‌పై పూనమ్ ఎన్నో విమర్శలు చేసింది. నేను, మరి కొందరు ఇన్ని రకాల రాజకీయ బాధలు పడేవాళ్లం కాదు. నేను సైలెంట్‌గా ఎంతో సఫర్ అయ్యాను. ఆ సమయంలోనే నేనీ విషయాన్ని చెప్పాను. ఫిర్యాదు కూడా చేశాను. కానీ అప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా త్రివిక్రమ్‌ను విచారించాలని మొరపెట్టుకుంది. అతనొక మోసగాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు మండిపడింది. గతంలో పవన్‌కల్యాణ్‌కు, పూనమ్‌కు మధ్య సంబంధం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో త్రివిక్రమ్ చురుగ్గా వ్యవహరించాడని కూడా వార్తలు వచ్చాయి. దీంతో మరో సారి ఇది హాట్ టాపిక్ గా మారింది.