‘గేమ్ ఛేంజర్’.. ‘డాకూ మహారాజ్’ టిక్కెట్ల ధర పెంపు
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:22 AM
సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలు ‘గేమ్ ఛేంజర్’, ‘డాకూ మహారాజ్’. ఈ సినిమాల టిక్కెట్ల ధర పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 10న....
సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలు ‘గేమ్ ఛేంజర్’, ‘డాకూ మహారాజ్’. ఈ సినిమాల టిక్కెట్ల ధర పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఆరోజు మొత్తం 6 షోలు ఉంటాయి. మరోవైపు, బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ‘డాకూ మహారాజ్’. ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ మేరకు హోమ్‌శాఖ ముఖ్య కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
సినిమా బెనిఫిట్ షో అదనపు షోలు పెరిగిన టిక్కెట్ ధరలు ఎన్ని రోజులు
(సమయం.. టిక్కెట్ ధర)
గేమ్ ఛేంజర్ అర్థరాత్రి ఒంటి గంటకు. ఒకటి(రోజుకు) సింగిల్ స్ర్కీన్స్ రూ.135 జనవరి 11 - 23 వరకు
రూ.600 మల్టీప్లెక్స్ రూ.175
డాకూ మహరాజ్ ఉదయం నాలుగు గంటలకు.. ఒకటి(రోజుకు) సింగిల్ స్ర్కీన్స్ రూ.110 జనవరి 12 - 25 వరకు
రూ.500 మల్టీప్లెక్స్ రూ.135