Siva Balaji: పూనమ్ కౌర్ ఆరోపణలపై స్పందించిన 'మా'

ABN , Publish Date - Jan 05 , 2025 | 07:20 PM

Siva Balaji: నటి పూనమ్ కౌర్.. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కంప్లైంట్ ఇచ్చిన మూవీస్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) పట్టించుకోవడం లేదని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా MAA కోశాధికారి శివ బాలాజీ స్పందించారు. ఆయన పూనమ్ ట్విట్టర్ లో చేస్తున్న రాద్ధాంతంలో అర్థం లేదు అన్నారు.

siva balaji denies poonam kaur's allegations

శివ బాలాజీ ఈ వివాదంపై స్పందిస్తూ..“పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. మా టర్మ్ కంటే ముందే ఆమె కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డుల్లో ఎక్కడా లేదు. అయితే కంప్లైంట్ ఇచ్చినట్టు పూనమ్ కౌరు ట్విట్టర్ లో పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మా అసోసియేషన్ ను కానీ న్యాయ వ్యవస్థను కానీ ఆమె ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుంది” అంటూ శివ బాలాజీ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు నెటిజన్లు కూడా పూనమ్ కౌర్ వైఖరిపై మండిపడుతున్నారు.


పూనమ్ ఆరోపణలు

'‘త్రివిక్రమ్‌పై గతంలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(MAA)లో ఫిర్యాదు చేశా. అయితే ఆయన వెనక ఉన్న పెద్ద మనుషుల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నా ఆరోగ్యం, ఆనందాన్ని ప్రభావితం చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు" అంటూ పలుమార్లు ట్వీట్ చేసింది.


ఈ వివాదంపై గతంలోనూ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మ‌హిళల భద్రత విషయంలో టాలీవుడ్ మిగతా చిత్ర పరిశ్రమల కంటే ఎంతో ముందుందని, వర్క్ ప్లేస్ లో అమ్మాయిలకు వేధింపులు ఉంటే ఖచ్చితంగా ఎంత పెద్దవారినైనా మేము విచారిస్తాం అన్నారు. పూనమ్ కౌర్ కమిటీలో రిపోర్ట్ చేయకుండా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉపయోగం లేదని వ‌చ్చి ఫిర్యాదు చేయాల‌న్నారు. ఎవరికి ఎంత ఇన్ ఫ్లూయెన్స్ ఉన్నా.. కమిటీ విచారణ మాత్రం న్యాయబద్దంగా జరుగుతుందన్నారు

Updated Date - Jan 05 , 2025 | 07:20 PM