Lust stories - Konkona Sen: ఆ మాట అన్నా పట్టించుకోను

ABN , Publish Date - Mar 24 , 2024 | 09:30 AM

ఆమె బాలీవుడ్‌లో చెలరేగుతున్న బెంగాల్‌ తుఫాన్‌. నటి, దర్శకురాలిగా ఆమె ఎప్పటికప్పుడు తన ప్రతిభ నిరూపించుకుంటూనే ఉంటుంది. ఆమె పేరు కొంకణా సేన్‌. ఇటీవలే ‘కిల్లర్‌ సూప్‌’ (killer soup) వెబ్‌ సిరీస్ తో  ప్రేక్షకులముందుకు వచ్చింది.

Lust stories - Konkona Sen: ఆ మాట అన్నా పట్టించుకోను

ఆమె బాలీవుడ్‌లో చెలరేగుతున్న బెంగాల్‌ తుఫాన్‌.

నటి, దర్శకురాలిగా ఆమె ఎప్పటికప్పుడు తన ప్రతిభ నిరూపించుకుంటూనే ఉంటుంది.

ఆమె పేరు కొంకణా సేన్‌. ఇటీవలే ‘కిల్లర్‌ సూప్‌’ (killer soup)

వెబ్‌ సిరీస్ తో  ప్రేక్షకులముందుకు వచ్చింది.

కొంకణా సేన్‌ (Konkona Sen Sharma) గురించి కొన్ని విశేషాలు.

ఇటీవల వచ్చిన ‘కిల్లర్‌ సూప్‌’ వెబ్‌ సిరీస్ లో కొంకణా సేన్‌ (Konkona Sen Sharma) నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.  ఆమె  పెద్దగా కలర్‌ ఉండదు. ఆమె ఇన్‌స్టాలాంటి వేదికలమీద పోజులేమీ కనిపించవు. చూడటానికి సాధారణంగా ఉంటుంది. అయితే ఆమెకు వచ్చిన పాత్రల్లో మాత్రం అసాధారణమైన నటన కనబరుస్తుంది. అందుకే ఆమె నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకులుండరు.

Konkana.jpg

అలా సినిమా ఇండస్ట్రీలోకి...

కొంకణా సేన్‌ బెంగాల్‌లో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి ముకుల్‌ శర్మ రైటర్‌, జర్నలిస్ట్‌. తల్లి నటి, దర్శకురాలు... అపర్ణా సేన్‌. తాతయ్య చిదానంద రచయిత, ఫిల్మ్‌ క్రిటిక్‌. అలా క్రియేటివిటీ కుటుంబం నుంచి వచ్చిన కొంకణ.. నాలుగో తరగతి చదువుతున్నప్పుడే ‘ఇందిర’ అనే బెంగాలీ చిత్రంలో నటించింది. మ్యూజిక్‌ వినటం, పుస్తకాలు చదవటం, వరల్డ్‌ మూవీస్‌ చూడటం చిన్నప్పటి నుంచే ఆ నేచర్‌ అబ్బింది. పదిహేనేళ్ల వయసులో ‘ఆమోదిని’ అనే చిత్రంలో నటించింది. నటిగా తొలి చిత్రంలో నెగటివ్‌ షేడ్‌లో నటించింది. ఆమె నటిగా అందరికీ పరిచయమైంది మాత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయ్యర్‌’తో. తన తల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమిళ గృహిణిగా కొంకణా నటించింది. తొలి చిత్రానికే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కించుంది. ఇప్పటి వరకూ ఫిల్మ్‌ఫేర్‌ ప్రచురించిన ‘80 ఐకానిక్‌ పర్ఫార్మెన్స్‌’లో ఈ సినిమాలో నటించిన పాత్ర ఒకటి.

బాలీవుడ్‌లో క్రేజ్‌ ...

జాతీయ అవార్డ్‌ వచ్చినా ఆమెను బాలీవుడ్‌లో ఎవరూ పట్టించుకోలేదు. ‘పేజ్‌ 3’, ‘ఓంకార’, ‘లైఫ్‌ ఇన్‌ మెట్రో’, ‘ఫ్యాషన్‌’.. లాంటి చిత్రాల్లో నటనకు స్కోప్‌ ఉండే చిన్న పాత్రల్లో నటించింది. రణబీర్‌ కపూర్‌తో నటించిన ‘వేకప్‌ సిద్‌’తో కమర్షియల్‌ హిట్‌ అందుకుంది. అయినా ఆమెకు సోలో హీరోయిన్‌ పాత్రలు రాలేదు. అందుకు బాధపడలేదు. తన ట్రాక్‌ ఏంటో ఆమెకు తెలుసు. అందుకే చాలా సందర్భాల్లో ‘నటిగా నా స్థానం ఏంటో తెలుసు. నేనెప్పుడూ మెయిన్‌ స్ట్రీమ్ హీరోయిన్‌ కాదు. ఎవరైనా కాదన్నా.. పెద్దగా పట్టించుకోను. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయటమే నాకు ముఖ్యం’ అన్నది.

konkana 2.jpeg

దర్శకురాలిగా సక్సెస్‌...

తన తండ్రి ముకుల్‌ శర్మ రాసిన కథతో ‘ఎ డెత్‌ ఇన్‌ ద గంజ్‌’ చిత్రాన్ని తెరకెక్కించింది కొంకణ. ఈ చిత్రానికి ‘బెస్ట్‌ డెబ్యూ  డైరక్టర్‌’ అవార్డు దక్కించుకుంది. 2000 నుంచి 2003 మధ్యలో వచ్చిన ముంబై డైరీస్‌’ టెలివిజన్‌ సిరీస్‌లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. గతేడాది ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించింది. ‘మా అమ్మ నాకు మంచి స్నేహితురాలు. తను కూడా చిన్న వయసులో కెరీర్‌లోకి వచ్చింది. ఇద్దరం కథల గురించి మాట్లాడతాం. జెనరేషన్‌ గ్యాప్‌ ఎక్కువ ఉన్నా.. మా అమ్మ ఆలోచనా తీరు అద్భుతం. మా నాన్న ఫెమినిస్ట్‌. ఆయనో థింకర్‌. క్రియేటివిటీ పేరెంట్స్‌ మధ్యన నేను ఇలా దర్శకురాలిని కావటం పెద్ద గొప్పేమీ కాదు’ అంటుంది కొంకణ.

అదే నాకు సంతోషం...

కొంకణా తన భర్త నుంచి నాలుగేళ్ల క్రితం విడిపోయింది. తనకో కొడుకు ఉన్నాడు. ‘సినిమాలపైనే ఆలోచన. నాకు ఉండే స్పేస్‌లో ఫిట్‌ అవ్వాలనుకుంటా. అంతేకానీ స్టార్స్‌తో నటించాలనుకోను’ అంటుంది. ముందు నుంచి స్టయిల్‌గా కెమెరా ముందు ఫోజులు ఇవ్వటం ఆమెకు నచ్చని వ్యవహరం. ‘మా అమ్మనే నా వ్యక్తిత్వాన్ని మార్చింది. నటిగా రాణిస్తున్నానంటే ఆ ఘనత అమ్మదే’ అంటుంది కొంకణా.

konkana 3.jpeg

Updated Date - Mar 24 , 2024 | 09:30 AM