BiggBoss 7 : రూల్స్‌ తెలుసుకో... రెచ్చిపోయిన అమర్‌..!

ABN , First Publish Date - 2023-09-30T11:47:52+05:30 IST

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 (Biggboss 7) ఉల్టాపుల్టాగా జోరుగా సాగుతోంది. ఇప్పటికి మూడు వారాలు ఎలిమినేషన్స పూర్తయ్యాయి. కిరణ్‌ రాథోడ్‌, షకీలా, దామిని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే వీరిలో మొదటి ఇద్దరూ ఎలిమినేట్‌ అవుతారని ముందే ఊహించారు. కానీ దామిని బయటకు వెళ్లడం మాత్రం ఎవరూ ఊహించలేదు.

BiggBoss 7 : రూల్స్‌ తెలుసుకో...  రెచ్చిపోయిన అమర్‌..!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 (Biggboss 7) ఉల్టాపుల్టాగా జోరుగా సాగుతోంది. ఇప్పటికి మూడు వారాలు ఎలిమినేషన్స పూర్తయ్యాయి. కిరణ్‌ రాథోడ్‌, షకీలా, దామిని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే వీరిలో మొదటి ఇద్దరూ ఎలిమినేట్‌ అవుతారని ముందే ఊహించారు. కానీ దామిని బయటకు వెళ్లడం మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇదొక పెద్ద ట్విస్ట్‌గా భావిస్తున్నారు. ఇప్పుడు నాలుగో వారాంతం వచ్చింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారా? అన్నది చూడాలి. ఇప్పటికే నామినేషన్స ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్స్‌లో శుభశ్రీ, గౌతమ్‌ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక జైన్‌, రతిక రోజ్‌, ప్రిన్స్‌ యావర్‌ ఉన్నారు. అయితే హౌస్‌లో కొత్త కొత్త టాస్క్‌లు ఇస్తూ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లకు పెద్ద పరీక్షలే పెడుతున్నారు. తాజాగా కొత్త ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఓ కొత్త టాస్క్‌ను ఇచ్చారు. దీన్ని చూస్తే ఇంటి సభ్యులు అందాల పోటీలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌ విచిత్రమైన గెటప్స్‌లో కనిపించి సందడి చేశారు. అయితే ఈ పోటీల్లో ఎవరో ఒకరిని విజేతగా ప్రకటించాల్సిన బాధ్యతను జడ్జ్‌గా వ్యవహరిస్తున్న శివాజీ, ఆట సందీప్‌ మాస్టర్‌ శోభాశెట్టిలపై ఉంది. అయితే అందాల పోటీల్లో కంటెస్టెంట్స్‌ అందరూ రెడీ అయ్యి ప్రదర్శన ఇచ్చారు. (Ulta pulta Biggboss)

BB7.jpeg

శుభశ్రీ జిగేల్‌ రాణి పాటకు భలే స్టెప్పులేసింది. తన డాన్స చూస్తే హార్ట్‌ మెల్ట్‌ అయిపోతుందని సందీప్‌ కామెంట్‌ చేశాడు. కాస్త గేమ్‌ అయిన తర్వాత విజేత శుభశ్రీ కావచ్చని అంటూ జడ్జి ప్రకటిస్తుండగా.. అమర్‌ దీప్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మీ జడ్జ్‌మెంట్‌పై నాకు అనుమానం ఉంది. నేను మాట్లాడాక చెప్పండి అని బల్ల గుద్దుతూ విరుచుకుపడ్డాడు. ’నేనిచ్చిన ఎంటర్‌టైనమెంట్‌ మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌లా కనిపించలేదా? వాళ్లు ఇచ్చిన ఎంటర్‌టైనమెంట్‌లో ఏముంది. నేను ఇచ్చినదానిలో ఏమి లేదు’ అని ప్రశ్నించాడు. అతని మాటలతో హౌస్‌ ఒక్కసారిగా హాట్‌ హాట్‌గా మారిపోయింది. మీకు ఇష్టమైనవారినే విజేతలుగా నిర్ణయిస్తారా అంటూ ఫైరయ్యాడు. అయితే దీనికి శివాజీ దీటుగా రిప్లై ఇచ్చాడు. శుభశ్రీ ఇన్నోవేటివ్‌గా అనిపించింది అని శివాజీ చెప్పగా... చెప్పిన డ్రెస్సెస్‌ ప్రకారం.. నేను రెడీ అయ్యా అని అమర్‌ సమాధానమిచ్చాడు. ుముందు నువ్వు రూల్‌ బుక్‌ చూసి మాట్లాడు అంటూ అమర్‌దీప్‌కు కౌంటరిచ్చాడు శివాజీ. అక్కడున్న ప్రాపర్టీస్‌ వాడుకోమన్నారు కానీ ఇవన్నీ చెప్పలేదు సార్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-09-30T12:14:23+05:30 IST