trivikram:త్రివిక్రమ్ కి షాకిచ్చిన శివ కార్తికేయన్
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:14 PM
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్... హీరోల వేట మొదలు పెట్టారు. స్టోరీలైన్ రెడీగా ఉన్నా హీరోలు దొరకడం లేదు. దీంతో కోలీవుడ్ హీరోలపై కన్నేశారు.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పరిస్థితి. స్టోరీలు రెడీగా ఉన్నా చేయడానికి హీరోలే దొరకడం లేదు గురూజీకి. మొన్నటివరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా సెట్ అయినట్టే అని అందరూ అనుకున్నారు కానీ కట్ చేస్తే ఆ సినిమాకు ముందు బన్నీ, అట్లీ (Atlee) కాంబో ఫిక్స్ అయింది. దీంతో స్టార్ డైరెక్టర్ కొత్త ఆప్షన్స్ కోసం వేట మొదలెట్టారు. ఈ క్రమంలో ఆయన కన్ను కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan )పై పడింది.
‘అమరన్’ ( Amaran ) తో తెలుగు, తమిళ భాషలలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శివ కార్తీకేయన్(Sivakarthikeyan)తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు త్రివిక్రమ్. ఆ మధ్య చెన్నైలో శివతో త్రివిక్రమ్ టీమ్ మీటింగ్ కూడా పెట్టింది. శివ కూడా త్రివిక్రమ్‌తో వర్క్ చేయడానికి సూపర్ ఎక్స్‌సైటెడ్‌గా ఉన్నారు. ప్రాజెక్టు సెట్ అయినట్టే అనుకుంటుండగా లాస్ట్ మినిట్ లో శివకార్తికేయన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారట.
త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కోసం శివ కార్తికేయన్ ఏకంగా 70 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఆ డిమాండ్ కి త్రివిక్రమ్ టీమ్ స్టన్ అయిపోయిందట. ఈ బడ్జెట్‌తో ప్రాజెక్ట్ ఫైనాన్షియల్‌గా వర్కౌట్ కాదని ఫీలై, త్రివిక్రమ్ ఈ ప్లాన్‌ని పక్కన పెట్టేశారని టాక్. ప్రస్తుతం గురూజీ వెంకటేష్ (Venkatesh) కోసం ఓ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. డిస్కషన్స్ ఇంకా ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అలాగే, అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌పై కూడా వర్క్ జరుగుతోంది. కానీ ఏదీ ఇంకా ఫైనల్ కాలేదు. టాప్ హీరోలంతా బిజీగా ఉండడంతో త్రివిక్రమ్‌కి ఇప్పుడు లాంగ్ వెయిట్ తప్పేలా లేదు. మరి గురూజీతో వెంటనే చేయబోయే హీరో ఎవరవుతారో చూద్దాం.