Icon Star Allu Arjun: కొత్త అధ్యాయానికి నాంది
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:20 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషల్ స్టార్ గా మారబోతున్నాడు. అతన్ని ఆ స్థాయిలో నిలిపేందుకు అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ పాన్ ఇండియా మూవీ నిర్మిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (icon star Allu Arjun), ప్రముఖ దర్శకుడు అట్లీ (Atlee) కాంబోలో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా మూవీ ఏ స్థాయిలో ఉండబోతోందో తెలియచేస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిపోయింది. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures) కళానిధి మారన్ (Kalanithi Maran) సమర్పణలో నిర్మించే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందనేదీ ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి హైదరాబాద్ నుండి అల్లు అర్జున్ చెన్నయ్ వెళ్ళడం, అక్కడ నుండి అట్లీతో కలిసి లాస్ ఏంజెల్స్ లోని స్టూడియోస్ లో హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కలవడం ఈ వీడియోలో ఉంది.
ఈ సినిమాతో మూడు అద్భుతమైన శక్తులు ఒకటి కాబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఆవతరించిన అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' లాస్ట్ ఇయర్ బెగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలానే హిందీ చిత్రం 'జవాన్'తో పాటు తమిళచిత్రాలు 'బిగిల్, మెర్సల్'తో అట్లీకి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఇక వీరిద్దరితో కలిసి సినిమా నిర్మించబోతున్న సన్ పిక్చర్స్ కు గొప్ప ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ ముగ్గురి కలయికలో వచ్చేది ఖచ్చితంగా అందరి అంచనాలు మించే వండర్ ఫుల్ ప్రాజెక్ట్ అవుతుందని అంతా నమ్ముతున్నారు.
హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కలిసి బన్నీ, అట్లీకి అక్కడ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ మరింత బూస్టప్ ఇచ్చేది గా ఉంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని అర్థమౌతోంది. సంచలన దర్శకుడు అట్లీ తొలిసారి తెలుగులో రూపొందిస్తున్న ఈ అంతర్జాతీయ పాన్ ఇండియా సినిమా ఈ యేడాది చివర్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియచేస్తామని అంటున్నారు.
Also Read: Raid -2: అవినీతి నేత వర్సెస్ ఐ.ఆర్.ఎస్. అధికారి....
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి