Hari Hara Veera Mallu: వీరమల్లు మళ్లీ వాయిదా పడనుందా
ABN , Publish Date - Apr 16 , 2025 | 02:01 PM
ఆ హీరోతో సినిమా అంటే ఎండ్ లేని పజిల్‌లా మారుతోంది. బ్రేకుల మీద బ్రేకులు వస్తున్నా... అలుపెరగకుండా షూటింగ్స్ కు ప్లాన్ చేస్తున్నా... మళ్లీ చుక్కెదురౌతోంది. పవర్ సునామీ పక్కా వచ్చేస్తోందని ఆశపడ్డ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురవుతోంది. ఎప్పటికప్పకప్పుడు లెక్కలు మారుతుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలియక తికమకపడుతున్నారు అభిమానులు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )నటిస్తోన్న మోస్ట్ అవెటైడ్ మూవీ హరిహరవీరముల్లు (Hari Hara Veera Mallu) . ఐదేళ్ల క్రితం మొదలైన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. 70 నుంచి 80 శాతం షూటింగ్ కంప్లీట్ కాగా... మిగతా షెడ్యూల్ ను ఫినిష్ చేయడానికి కొద్దిగా టైమ్ పట్టేలా కనిపిస్తోంది. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పొలిటికల్ గా ఎంతో బిజీ అయిపోవడంతో షూట్ ఆలస్యం అవుతోందని టాక్. ఈ సంగతి ఇలా ఉంటే తాజా రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుండటంతో అభిమానులలో ఆందోళన మొదలైంది.
పవన్ నటిస్తున్న ఈ మాసీవ్ ప్రాజెక్ట్ ను డైరెక్టర్ క్రిష్ (Krish ) ఆరంభించాడు. ఆ తర్వాత చిత్ర నిర్మాత ఎ.ఎమ్.రత్నం తనయుడు జోతికృష్ణ (Jyothi Krishna ) చేతిలోకి వెళ్లింది. దీంతో ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా త్వరగా ఫినీష్ అవుతుందని భావించారు. అనుకున్నట్లే పవన్ లేని షాట్స్ ను చకా చకా ఫినిష్ చేశారు. నిన్న మొన్నటి వరకు స్పీడ్ గా షూటింగ్ జరుపుకున్న ఈమూవీ... ఇప్పుడు మళ్లీ నెమ్మదించింది. దీంతో ఇప్పటికే పలు మార్లు వాయిదా పడి మే 9న రిలీజ్ కావాల్సిన మూవీ... మరో సారి వాయిదా పడి మే 30 కి షిఫ్ట్ కానుందనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. పైగా పవన్ పై కొన్ని సీన్లు చిత్రీకరణ జరగాల్సి ఉంది. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయట. పవన్ అనారోగ్య కారణంగా ఇప్పట్లో షూటింగ్ కు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదనీ వినిపిస్తోంది. దీంతో ఈ మూవీ మరోసారి వాయిదా పడటం ఖాయం అంటున్నారు.
అయితే హరిహర వీరమల్లు మూవీని పవన్ కళ్యాణ్ ప్రెస్టిజియస్ గా తీసుకున్నాడని... అందుకే హడావుడిగా కంప్లీట్ చేయకుండా టైమ్ తీసుకుని చేస్తున్నాడని యూనిట్ అంటోంది. పదిహేడవ శతాబ్దంలోని మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ మూవీలో పవన్ క్యారెక్టర్ రాబిన్‌హుడ్ తరహాలో ఉండబోతుందట. ఇప్పటి వరకూ వాయిదా విషయం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రాజెక్ట్ మళ్లీ వాయిదా పడనుందని తెలిసి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి వాయిదా విషయంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.