Ustaad BhagatSingh: క్రేజీ అప్‌డేట్‌.. మ్యూజికల్‌ మ్యాజిక్‌ రెడీ!

ABN , First Publish Date - 2023-04-30T20:49:10+05:30 IST

శరవేగంగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ నిర్మాణ పనులు ప్రారంభమైన సంగీత చర్చలు.. ‘గబ్బర్‌ సింగ్‌’ని మించిన ఆల్బమ్‌ అందించడానికి కసరత్తులు

Ustaad BhagatSingh: క్రేజీ అప్‌డేట్‌.. మ్యూజికల్‌ మ్యాజిక్‌ రెడీ!

శరవేగంగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ నిర్మాణ పనులు

ప్రారంభమైన సంగీత చర్చలు.. (Ustaad Bhagat singh)

‘గబ్బర్‌ సింగ్‌’ని మించిన ఆల్బమ్‌ అందించడానికి కసరత్తులు

కొన్ని కాంబినేషన్‌లకు క్రేజ్‌ వేరుగా ఉంటుంది. ఎన్నేళ్లు అయినా ఆ క్రేజ్‌ (crazy combination) చెక్కు చెదరదు. అలాంటి కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ అవుతుంది. ‘గబ్బర్‌సింగ్‌’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) – హరీశ్‌ శంకర్‌ (harish shankar) కాంబోలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్‌లైన్‌. ఈ కాంబినేషన్‌కు మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీ ప్రసాద్‌ (devi sri prasad) తోడైతే ఇక ఆ కిక్కే వేరు. ఈ ముగ్గురు కలిసి మరోసాకి మ్యూజికల్‌ మ్యాజిక్‌ చేయబోతున్నారు. ‘‘ఉస్తాద్‌ గబ్బర్‌సింగ్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మొదలయ్యాయి ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాత సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. దానిలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌, రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ చర్చలు జరుపుతూ కనిపించారు. ‘ది బ్లాక్‌ బస్టర్‌ గబ్బర్‌ మ్యాజికల్‌, మ్యూజికల్‌ కాంబో ఈజ్‌ బ్యాక్‌’ అనే వీడియోతో ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్‌ చెప్పిన ‘అరేయ్‌ సాంబా.. రాస్కోరా’ అని పలికించారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌ వస్తాయని మైత్రీ సంస్థ పేర్కొంది. ఈ సినిమాలో పవన్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఇటీవల సెట్స్‌ మీదకెళ్లిన ఈ చిత్రం ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. పది రోజులు జరిగిన చిత్రీకరణలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. దానికి సంబంధించిన ఎడిటింగ్‌ వర్క్‌ కూడా మొదలైంది.

Updated Date - 2023-04-30T20:49:10+05:30 IST