Kollywood 2022: అగ్రహీరోలకు ‘అరకొర’.. ‘జోష్’లో మినిమం గ్యారెంటీ హీరోలు

ABN , First Publish Date - 2022-12-31T18:21:04+05:30 IST

2022 సంవత్సరానికి టాటా చేప్పేసి 2023 సంవత్సరానికి (New Year) స్వాగతం పలుకుతున్నాం. అయితే, 2022లో తమిళ చిత్ర పరిశ్రమలో ఎక్కువ చిత్రాల్లో పనిచేసిన

Kollywood 2022: అగ్రహీరోలకు ‘అరకొర’.. ‘జోష్’లో మినిమం గ్యారెంటీ హీరోలు
Kollywood Heroes

2022 సంవత్సరానికి టాటా చేప్పేసి 2023 సంవత్సరానికి (New Year) స్వాగతం పలుకుతున్నాం. అయితే, 2022లో తమిళ చిత్ర పరిశ్రమలో ఎక్కువ చిత్రాల్లో పనిచేసిన దర్శకనటులు, హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇండస్ట్రీలో అగ్రహీరోలైన కమల్‌ హాసన్‌ (Kamal Haasan), రజనీకాంత్‌ (Rajinikanth), విజయ్‌ (Vijay), అజిత్‌ (Ajith), ధనుష్‌ (Dhanush), సూర్య (Suriya) వంటివారు ఒకటీ అరా చిత్రాలతో సరిపెట్టగా.. మినిమిం గ్యారెంటీ హీరోలుగా గుర్తింపు పొందిన వారే నాలుగైదు చిత్రాల్లో నటించారు. అలాగే, ఒక దర్శకుడు తెరకెక్కించిన చిత్రాలు, ఒకే హీరోయిన్‌ అత్యధికంగా నటించిన చిత్రాల వివరాలను పరిశీలిస్తే...

Jai.jpg

హీరోల్లో (Heroes)... : అశోక్‌ సెల్వన్‌ (Ashok Selvan), అశోక్‌ కుమార్‌ (Ashok Kumar), జై (Jai) మాత్రం అత్యధికంగా ఐదు చిత్రాల్లో నటించారు. ఇందులో అశోక్‌ సెల్వన్‌ ‘సిల నేరంగళిల్‌ సిల మనిదర్‌గళ్’, ‘మన్మథలీలై’, ‘హాస్టల్‌’, ‘వేళమ్‌’, ‘నిత్తం ఒరు వానం’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అశోక్‌ కుమార్‌ ‘విడియాద ఇరవొన్రు వేండుం’, ‘బెస్టీ, ‘మాయాత్తిరై’, ‘4554’, ‘తెర్కత్తి వీరన్‌’ చిత్రాలున్నాయి. జై నటించిన ఐదు చిత్రాల్లో ‘వీరపాండియపురం’, ‘పట్టాంపూబూచ్చి’, ‘ఎన్నితుణిగ’, ‘కాఫి విద్‌ కాదలి’, ‘కుట్రం కుట్రమే’ ఉన్నాయి. అయితే, హాస్య నటుడు యోగిబాబు మాత్రం ఈ యేడాది గరిష్టంగా 15 చిత్రాల్లో నటించారు.

Lakshmi.jpg

హీరోయిన్ల (Heroines) లో.. : నటి ఐశ్వర్యలక్ష్మి ఐదు చిత్రాల్లో నటించింది. ‘పుత్తం పుదు కాలై విడియాదా’, ‘గార్గి’, ‘కెప్టెన్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘గట్టా కుస్తి’ చిత్రాలున్నాయి.

సంగీత దర్శకుల్లో (Music Directors)... కోలీవుడ్‌కు చెందిన సంగీత దర్శకుల్లో డి. ఇమ్మాన్‌, జిబ్రాన్‌, జీవీ ప్రకా‌ష్‌, సంతోష్‌ నారాయణన్‌, యువన్‌ శంకర్‌ రాజా, ఇళయరాజా, అనిరుధ్‌, శ్యామ్‌ సీఎస్‌, ఏఆర్‌ రెహ్మాన్‌ పలు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. వీరిలో యువన్‌ శంకర్‌ రాజా, ఇమాన్‌, జిబ్రాన్‌ ఏడేసి చిత్రాలకు సంగీతం సమకూర్చారు. జీవీ ప్రకాష్‌, సంతోష్‌ నారాయణన్‌లు ఆరు చొప్పున, ఇళయరాజా, అనిరుధ్‌, శ్యామ్‌ సీఎస్‌లు ఐదేసి చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఏఆర్‌ రెహ్మాన్‌ మాత్రం నాలుగు చిత్రాలతో సరిపెట్టుకున్నారు. వీటిలో ‘ఇరవిన్‌ నిళల్‌’, ‘కోబ్రా’, ‘వెందు తణిందదు కాడు’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఉన్నాయి.

కాగా దర్శకుల్లో ఒక్క సుశీంద్రన్‌ మాత్రమే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాల్లో కూడా జై హీరోగా నటించారు.

Updated Date - 2022-12-31T18:35:47+05:30 IST