Rashmika : రిలేషన్ షిప్స్ చెడిపోరాదంటున్న రశ్మిక

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:41 PM

ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఆ జంట ఏ నాటికీ విడిపోదంట! ఈ సత్యం ఈ నాటిది కాదు... అయినా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు జనం... నేషనల్ క్రష్ గా మారిన రశ్మిక కూడా ఆ మాటలే మననం చేసుకుంటోంది... ఇంతకూ ఎందుకబ్బా!?...

అందాలభామ రశ్మిక మందణ్ణ (Rashimika Mandanna) పేరు వినగానే చప్పున తెలుగువారికి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా గుర్తుకు వస్తుంటారు. ఎందుకంటే వారిద్దరూ ప్రేమపక్షుల్లా ఎక్కడికో ఎగిరిపోతుంటారు. మళ్ళీ ఎవరి గూట్లో వాళ్ళు చేరుతుంటారు... అందువల్ల వీరిద్దరికి సంబంధించిన ఏ అంశం వెలుగు చూసినా, మరొకరు కూడా ఉన్నారా లేదా అంటూ ఆరా తీస్తుంటారు జనం. ఇంతకూ అసలు విషయమేమిటంటే - "కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుంటే - ఎన్నటికీ చేయి విడవకుంటే - రిలేషన్ షిప్స్ చెడిపోవు." అనే సారాంశంతో ఓ పోస్ట్ ను రశ్మిక రీ పోస్ట్ చేసింది. దీంతో నేనూ ఏకీభవిస్తాను అంటూ చాటింపేసింది... దాంతో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.


అందుకే ప్రేమయాత్రలు...

రశ్మిక, విజయ్ దేవరకొండ ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు... ఉత్తరాదిన కూడా రశ్మిక బిజీ అయిపోయింది. 'యానిమల్ (Animal), ఛావా (Chhaava)' బ్లాక్ బస్టర్స్ తరువాత సల్మాన్ ఖాన్ తో నటించిన 'సికందర్' (Sikandar) తో రశ్మిక చాలా రోజులకు ఫ్లాప్ చూసింది. అయినా రశ్మికకు బాలీవుడ్ లో విశేషమైన క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో రశ్మిక ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది. మన సౌత్ లో లాగా కాకుండా బాలీవుడ్ లో ఎక్కువగా నైట్ షూటింగ్స్ సాగుతుంటాయి... దాంతో రశ్మిక అటు బాలీవుడ్ టైమింగ్స్ కు , ఇటు సౌత్ సిన్సియారిటీకి మధ్య నలుగుతోంది... ఆమెకు ఊరట నివ్వడానికే మధ్య మధ్యలో విజయ్ అలా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడేమో అనీ జనం అంటున్నారు.

పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం - అని మహాకవి అన్నారు. అదే తీరు ఇప్పుడు విశేషంగా సాగుతోంది... రిలేషన్ షిప్ గురించి రశ్మిక రీ పోస్ట్ చేయగానే, ఒకప్పటి రిలేషన్ షిప్ ఏమైందమ్మా అంటూ కొందరు వెక్కిరిస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం తాను ఎంత టాప్ పొజిషన్ కు చేరుకున్నా విజయ్ దేవరకొండతోనే ప్రేమాయణం సాగించడాన్ని అందరూ అభినందిస్తున్నారు. సౌత్ లో 'కుబేర, గర్ల్ ఫ్రెండ్' సినిమాలతో పాటు ఉత్తరాదిన మరికొన్ని ప్రాజెక్ట్స్ లో రశ్మిక నటిస్తోంది. వీటిలో కొన్నయినా ఈ యేడాది వెలుగు చూడనున్నాయి. మరి బంధాలు-అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్న రశ్మిక ఎప్పుడు పెళ్ళికూతురవుతుందో చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Also Read: Janani: గ్రాండ్ గా జనని అయ్యర్ నిశ్చితార్థం

Also Read: Bhaskhar Maurya: ముత్తయ్య పాట ఆవిష్కరించిన సమంత

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 17 , 2025 | 12:59 PM