Rajini Kanth: రజనీకాంత్ తో బాలకృష్ణ
ABN , Publish Date - Apr 17 , 2025 | 01:32 PM
రజనీకాంత్ 'జైలర్ -2' నటించబోయే తెలుగు స్టార్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో షికార్లు పుకారు చేస్తున్నాయి. అయితే ఆ ఛాన్స్ బాలయ్యకు దక్కితే అదరహో అంటున్నారు అభిమానులు.
కొన్ని కాంబినేషన్స్ జనానికి కనువిందు చేస్తూంటాయి. కానీ, సదరు కాంబోస్ ఎప్పుడు వర్కవుట్ అవుతాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉంటారు. ఇండియాలో టాప్ మాస్ హీరోస్ లో అధికులు సౌత్ లోనే ఉన్నారు. అలాంటి మాస్ హీరోస్ ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ ముచ్చటేంటో తెలుసుకుందాం.
నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) కు తెలుగునాట ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు... బాలయ్య నటించిన అనేక చిత్రాలు హిందీలో అనువాదమై ఉత్తరాది వారిని సైతం అలరించాయి... ఇక బాలయ్యను నేరుగా ఓ పాన్ ఇండియా మూవీతో ఏకకాలంలో ఆల్ ఇండియా ఆడియెన్స్ ముందు ఉంచాలని బోయపాటి శ్రీను (Boyapati Srinu) ప్రయత్నం చేస్తున్నారు... తత్ఫలితంగానే 'అఖండ-2' (Akhanda -2) తెరకెక్కుతోంది... ఈ చిత్రం సెప్టెంబర్ 25న జనం ముందుకు రావడానికి సిద్ధమవుతోంది... ఈ నేపథ్యంలోనే ఇంకో పాన్ ఇండియా మూవీ (Pan India movie) లో బాలయ్య నటిస్తున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది... అయితే ఆ సినిమాలో బాలయ్య స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తారని తెలుస్తోంది... గత కొద్ది రోజులుగా రజనీకాంత్ 'జైలర్ 2' (Jailer -2)లో బాలయ్య ఓ ప్రత్యేక పాత్రలో తళుక్కుమంటారని వినిపిస్తోంది... అదే న్యూస్ మరోమారు ఇప్పుడు చక్కర్లు కొడుతోంది...
బాలయ్యనే బెటర్ ఆప్షన్!
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'జైలర్' (Jailer) సినిమా ఘనవిజయం సాధించింది... ఆ సినిమాతోనే చాలా ఏళ్ళ తరువాత రజనీకి బిగ్ హిట్ లభించింది... ఆ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కాసేపు తెరపై తళుక్కుమన్నారు... వారు స్క్రీన్ పై కనిపించగానే థియేటర్లు మారుమోగిపోయాయి... అందువల్ల ఈ సెకండ్ పార్ట్ లో అంతకు మించి ఉండాలని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ భావించారుట.. గతంలో రజనీకాంత్ తో నటించని మాస్ హీరో అయితేనే సదరు సన్నివేశం రక్తి కడుతుందని నెల్సన్ అభిప్రాయం... లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటిస్తోన్న 'కూలీ'లో టాలీవుడ్ స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు... అందువల్ల అంతకు మించి బాక్సాఫీస్ షేక్ కావాలంటే బాలయ్యనే బెటర్ అని నెల్సన్ మాట... అదీగాక బాలయ్య డబ్బింగ్ సినిమాలతోనే ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించారు... అందువల్ల ఆయన ఉంటే 'జైలర్ 2'కు మరింత ప్లస్ అని భావిస్తున్నారు...
అదే జరిగితే... రచ్చ రచ్చే...
సౌత్ మాస్ హీరోస్ లో రజనీకాంత్, చిరంజీవి, బాలయ్య రేంజ్ లో స్టార్ డమ్ ఉన్నవారు కనిపించరు... గతంలో రజనీకాంత్, చిరంజీవి కలసి కొన్ని చిత్రాల్లో నటించారు... అందువల్ల ఈ సారి బాలయ్య అయితేనే రజనీకి తగ్గట్టుగా ఉంటుందని భావిస్తున్నారు... పైగా బాలయ్యతో తన అనుబంధాన్ని గురించి పెద్దాయన యన్టీఆర్ పై తనకున్న గౌరవాన్ని యన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో స్మరించుకున్నారు రజనీకాంత్... అప్పటి నుంచే బాలయ్య, రజనీకాంత్ ఒకే ఫ్రేమ్ లో నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు... ఆ తరువాతే నెల్సన్ కుమార్ కు కూడా రజనీ, బాలయ్య ఒక్క సీన్ లో కలసి కనిపించినా, సీన్ వేరేలా ఉంటుందని ఆలోచన వచ్చిందట... ఇన్ సైడ్ టాక్ ను బట్టి రజనీ 'జైలర్ -2'లో బాలయ్య స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తారనే వినిపిస్తోంది... అదే జరిగితే రచ్చ రంబోలాయే అంటున్నారు ఫ్యాన్స్ ... మరి రజనీ, నెల్సన్ అభిలాష ఏ మేరకు నెరవేరుతుందో చూద్దాం.
Also Read: Tollywood Directors: వీరి సినిమాలు ఎప్పుడు...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి