Vishwaksen Laila Song: ‘ఇచ్చుకుందాం బేబీ’ లిరికల్ సాంగ్ వచ్చేసింది..
ABN, Publish Date - Jan 23 , 2025 | 05:57 PM
మాస్ కా దాస్ విశ్వక్సేన్ ‘లైలా’ మూవీ నుండి సెకండ్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ హీరోహీరోయిన్లుగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘లైలా’. విశ్వక్సేన్ అమ్మాయి, అబ్బాయిగా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. అందులో భాగంగా వదిలిన ‘ఇచ్చుకుందాం బేబీ’ పాట ఎలా ఉందో మీరూ చూసేయండి..
మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లైలా’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అమ్మాయి- అబ్బాయిగా వైవిధ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ మొదలెట్టారు. ఇప్పటికే విడుదలైన సోనూ మోడల్ వీడియో సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలవగా.. గురువారం ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ’ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.
Also Read- Pushpa 2 OTT Release Date: ‘పుష్ప 2’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా.. ఓటీటీ లవర్స్ కోసం మరో ట్రీట్?
Also Read- Poonam Kaur: నాకు పాలిటిక్స్ తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే..
Also Read- Saif Ali Khan: సైఫ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఆ రివార్డు ఏమిటంటే..
Also Read- Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్.. హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా?
Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 23 , 2025 | 05:57 PM