Pattudala: ‘సవదీక’ తెలుగు లిరికల్ సాంగ్
ABN, Publish Date - Jan 30 , 2025 | 09:35 AM
రీసెంట్‌గా విడుదలైన విడాముయర్చి సినిమా ట్రైలర్ అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ అంచనాలను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళుతూ మేకర్స్ ఈ మూవీ నుంచి ‘సవదీక’ అనే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్‌ను వదిలారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. తెలుగులో ‘పట్టుదల’గా విడుదల చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘పట్టుదల’ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘సవదీక’ అనే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాటకు శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించారు. ఆంథోని దాసన్, అనిరుద్ ఈ పాటను ఆలపించారు.
Also Read- Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2 రీ లోడెడ్’.. నీ యవ్వ ఇక తగ్గేదే లే..
Also Read- Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Also Read- Mega Star Chiranjeevi: ఫస్ట్ షూటింగ్ నాదే..
Also Read- Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?
Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 30 , 2025 | 09:35 AM