Sandeep Reddy Vanga: దర్శకుడు సందీప్‌పై కామెంట్స్.. సమాధానం ఏంటంటే..
ABN , Publish Date - Mar 04 , 2025 | 01:46 PM
టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ప్రాధాన్యం ఉంటుందని కామెంట్స్ వినిపిస్తుంటాయి.

టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ప్రాధాన్యం ఉంటుందని కామెంట్స్ వినిపిస్తుంటాయి. ‘యానిమల్’(Animal)లో స్త్రీని తక్కువ చేసి చూపించారని కొందరు సినీ ప్రముఖులు దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిని విషయం తెలిసిందే. తాజాగా వీటిపై ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన స్పందించారు. తనపై, తన చిత్రాలపై వచ్చిన కామెంట్ల గురించి మాట్లాడారు. ‘మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా? లేదంటే హీరో లేకుండా తీస్తారా?. రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోండి’ అనే ప్రశ్న ఎదురుకాగా, సందీప్ జవాబిచ్చారు. ‘‘హీరో లేకుండా సినిమా తీయాలనేది (Sandeep reddy moive without hero)నా ఆలోచన. ఒకవేళ అలాంటి సినిమా తీస్తే నా చిత్రాలను విమర్శించిన మహిళలు దాన్ని కూడా ఇష్టపడరు. కావాలంటే ఈ విషయాన్ని నేను రాసిస్తాను. 4, 5 సంవత్సరాల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తాను. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా ‘5 ఏళ్ల క్రితం సందీప్ చెప్పింది. చేసి చూపించాడు’ అని మాట్లాడుకుంటారు’’ అని అన్నారు.
గత ఏడాది యానిమల్‌తో హిట్ అందుకున్న సందీప్ వంగా ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతూ.. దీని రికార్డులు బాహుబలిని దాటాలని లేదన్నారు. రూ.2000 కోట్లు అనేది చాలా పెద్ద విషయం. ఇదైతే మంచి సినిమా అవుతుంది. ఎంత వసూళ్లు సాధిస్తుందనేవి ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది’’ అన్నారు.
ALSO READ: Karnataka DCM: నటీనటుల తీరు మారకపోతే.. ఎలా సరిచేయాలో తెలుసు..
Film Industry: శ్రీదేవి, కేదార్ మరణాలు దుబాయ్ లో ఫిబ్రవరిలోనే...
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి