Anirudh: తెలుగులో అనిరుధ్ మోత.. పెద్ద సినిమాలన్నీ
ABN , Publish Date - Jan 22 , 2025 | 07:36 AM
Anirudh: అనిరుధ్ చిన్న వయసులోనే తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకొని రాక్ స్టార్‌గా ఎదిగాడు. ప్రత్యేకంగా ఆయన తమిళ్ సినిమాల్లో రజినీ ఎలివేషన్‌కి ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్‌కి రోమాలు నిక్కబొడవాల్సింది. అందుకే ఇప్పడు ఈ రాక్‌స్టార్ వెనకాల అన్ని ఇండస్ట్రీలు పరిగెడుతున్నాయి..

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అనిరుధ్ అది ఆధిపత్యం నడుస్తోంది. కేవలం కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, టాలీవుడ్ లోను ఆయన స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే తెలుగులో చాలా మంది స్టార్ హీరోలకు తమన్, డీఎస్పీ ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు ఫస్ట్ ప్రిఫరెన్స్‌లుగా ఉన్న విషయం తెలిసిందే. కానీ మరోసారి ఆ సీన్ మార్చేశాడు అనిరుధ్. ఇంతకీ ఏం జరిగిందంటే..
అనిరుధ్ చిన్న వయసులోనే తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకొని రాక్ స్టార్ గా ఎదిగాడు. ప్రత్యేకంగా ఆయన తమిళ్ సినిమాల్లో రజినీ ఎలివేషన్ కి ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ కి రోమాలు నిక్కబొడవాల్సింది. అందుకే ఇప్పడు ఈ రాక్ స్టార్ వెనకాల అన్ని ఇండస్ట్రీలు పరిగెడుతున్నాయి. గతేడాది ఆయన బాలీవుడ్ లో షారుఖ్ కి, టాలీవుడ్ ఎన్టీఆర్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లోని మరికొందరు స్టార్ హీరోలు ఆయన మ్యూజికే కావాలంటున్నారట. ఇప్పటికే రెండు బడా ప్రాజెక్స్ట్ కి అనిరుధ్ పేరు ఫిక్స్ అయిపోయిందట. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే..
'అఖండ 2' తర్వాత బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో జతకట్టనున్నాడు. 2023లో వీరసింహ రెడ్డి సినిమాతో మెస్మరైజ్ చేసిన ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడంతో అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మాస్ కి డెఫినేషన్ అయినా బాలయ్యకి అనిరుధ్ మ్యూజిక్ అయితే మరింతా బాగుంటుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. దాదాపుగా అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు.
మరోవైపు 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జతకట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి లేదా సందీప్ రెడ్డి వంగా-అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కి అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడు. మరి బన్నీ-అని కాంబో అంటే ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం.ఇవే కాకుండా మరికొన్ని బడా తెలుగు ప్రాజెక్ట్స్ ని కూడా అనిరుధ్ కొల్లగొట్టాడు.