Pawan Kalyan: సక్సెస్‌ను టీమ్‌గా తీసుకున్నప్పుడు.. సమస్యనూ అలాగే తీసుకోవాలి

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:00 PM

'టీమ్‌ అందరి సమష్టి కృషితోనే మేం ఈ సక్సెస్‌ సాధించాం’.. సినిమా ఫంక్షన్స్‌లో తరచూ వినిపించే మాట ఇది. సినిమా సక్సెస్‌ అయితే ప్రతి ఒక్కరి నుంచీ ఇదే మాట వస్తుంది. 

Pawan Kalyan:  సక్సెస్‌ను టీమ్‌గా తీసుకున్నప్పుడు.. సమస్యనూ అలాగే తీసుకోవాలి


'టీమ్‌ అందరి సమష్టి కృషితోనే మేం ఈ సక్సెస్‌ సాధించాం’.. సినిమా ఫంక్షన్స్‌లో తరచూ వినిపించే మాట ఇది.


సినిమా సక్సెస్‌ అయితే ప్రతి ఒక్కరి నుంచీ ఇదే మాట వస్తుంది. 

అదే ఫ్లాప్‌ అయితే దర్శకుడు మాత్రమే కారణం అన్నట్లు మాట్లాడతారు. 

అల్లు అర్జున్‌ (Allu Arjun) విషయంలో ఇదే జరిగిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (AP Deputy CM) అన్నారు. సోమవారం జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్యా థియేటర్‌ (Sandhya Theater Stampede) ఘటనను గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు. సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్‌కు తెలిసినా, తెలియకపోయినా బన్నీ తరఫున చిత్ర బృందం బాధిత కుటుంబం వద్దకు వెళ్లి మీకు అండగా మేమున్నాం అని ధైర్యం చెప్పుంటే బావుండేది. జరిగిన వెంటనే టీమ్‌ వెళ్లి స్పందించి ఉంటే ఇంత ఇష్యూ జరిగేది కాదు. మొత్తం ఇష్యూని అల్లు అర్జున్‌కు ఆపాదించారు. సినిమాను టీమ్‌గా తీసుకున్నప్పుడు ఈ సమస్యను కూడా టీమ్‌గా తీసుకోవాలి. సమస్యను హీరోపై పెట్టి ఒంటరి వ్యక్తిని చేసేశారు. అది కరెక్ట్ గా అనిపించలేదు. ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో అల్లు అర్జున్‌ను ఎవరూ సరిగా గైడ్‌ చేయలేదు. నా వల్ల ఓ మనిషి చనిపోయిందనే బాధ లైఫ్‌ టైమ్‌ బన్నీకి ఉంటుంది’’ అని అన్నారు. (Pawan Kalyan)

మిస్‌ గైడ్‌ చేశారు..

కొన్ని సందర్భాల్లో హీరో అభివాదం చేయకపోతే పొగరనుకుంటారు. అభివాదం చేయడం అనేది ఎంజాయ్‌ చేయడం కాదు.. అభిమానులకు భరోసా కల్పించడం. ఘటన జరిగిన వెంటనే సిబ్బంది ద్వారా తెలుసుకుని మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని చెప్పి, క్షమాపణలు కోరాల్సింది. ఓదార్చే సమయంలో ఒక్కోసారి మనం తిట్లు కూడా తినాల్సి వస్తుంది. అయితే ఘటన తర్వాత బన్నీని సరిగ్గా గైడ్‌ చేయలేదు. ఆయన వెనకున్నవారు ఇలా చేయండి.. ఇలా చెయొద్దు అనే విషయాల్లో కాస్త జాగ్త్రతలు చెప్పుంటే ఇష్యూ ఇంత వరకూ వచ్చేది కాదనిపిస్తుంది. ఆయన్ను మిస్‌ గైడ్‌ చేశారు.

     

Updated Date - Dec 31 , 2024 | 01:01 PM