Malavika Mohanan: సలార్‌తోనే ఎంట్రీ ఇవ్వాలి.. కానీ..

ABN , Publish Date - Dec 30 , 2024 | 02:21 PM

ప్రభాస్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ది రాజాసాబ్‌’. మాళవిక మోహనన్‌ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో కలిసి నటించడం గురించి మాట్లాడారు. ఆయనపై తనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

Malavika Mohanan: సలార్‌తోనే ఎంట్రీ ఇవ్వాలి.. కానీ..



ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ది రాజాసాబ్‌’. మాళవిక మోహనన్‌ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో కలిసి నటించడం గురించి మాట్లాడారు. ఆయనపై తనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ‘‘రాజాసాబ్‌’తో నేను తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాను. ఇదొక హారర్‌, రొమాంటిక్‌ కామెడీ మూవీ. ఆ సినిమా వర్క్‌లో భాగంగా కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నా. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో నేనెంతో సంతోషంగా ఉన్నా. ఇలాంటి జానర్‌లో నేను ఎప్పుడూ వర్క్‌ చేయలేదు. కామెడీ, హారర్‌, రొమాన్స్‌.. ఇలా అన్నిరకాల ఎలిమెంట్స్‌ ఈ కథలో ఉంటాయి. ప్రభాస్‌తో వర్క్‌ చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. ‘బాహుబలి’ సినిమాకు నేను వీరాభిమానిని. ‘బాహుబలి 1, 2’ చిత్రాలు చూసిన తర్వాత నేను ప్రభాస్‌కు అభిమానిని అయ్యా. ఆయనతో ఒక్కసారైనా వర్క్‌ చేయాలని కలలు కన్నా. అలాంటి సమయంలో నాకు ‘సలార్‌’ నుంచి అవకాశం వచ్చింది. ప్రశాంత్‌ నీల్‌ ఒక రోల్‌ కోసం అడిగారు(Prabhas- Malavika mohanan).

ఆ క్షణం ఎంతో సంతోషించా. నా కల నెరవేరుతుందనుకున్నా. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ చేయలేకపోయా. కొన్ని నెలల తర్వాత మారుతి నుంచి ‘రాజాసాబ్‌’ కోసం ఆఫర్‌ వచ్చింది. నేను ఆశ్చర్యపోయా. ప్రభాస్‌ మూవీతో నేను తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని రాసి పెట్టి ఉన్నట్టు ఉంది అనుకున్నా’’ అని మాళవికా మోహనన్‌ తెలిపారు. ప్రభాస్‌ సరసన మాళవికా మోహనన్‌, నిధీ అగర్వాల్‌, రిద్థి కుమార్‌ హీరోయిన్లు. ఈ చిత్రంలో ప్రభాస్‌ ఇప్పటివరకూ పోషించని రెండు భిన్న కోణాలు ఉన్న పాత్రలో సందడి చేయనున్నారు. 2025 ఏప్రిల్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated Date - Dec 30 , 2024 | 02:21 PM