Varun Sandesh: కాండ్రకోట మిస్టరీ.. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:25 PM

వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘నింద’. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లుగా మేకర్స్ చెబుతూ వస్తున్నారు. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ సినిమా విశేషాలను తాజాగా హీరో వరుణ్ సందేశ్ మీడియాకు తెలియజేశారు.

Varun Sandesh: కాండ్రకోట మిస్టరీ.. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు
Hero Varun Sandesh

వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా నటిస్తోన్న చిత్రం ‘నింద’ (Nindha). ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ (The Fervent Indie Productions) బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం (Rajesh Jagannadham) నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ (Kandrakota Mystery) అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లుగా మేకర్స్ చెబుతూ వస్తున్నారు. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ సినిమాను మైత్రీ మూవీస్ (Mythri Movies) నైజాంలో రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ చిత్ర విశేషాలను హీరో వరుణ్ సందేశ్ మీడియాకు తెలియజేశారు.

ఈ సినిమాను అంగీకరించడానికి ప్రధాన కారణం?

రొటీన్ సినిమాలు చేస్తూ, చేస్తూ నాకే బోర్ కొట్టింది. ఏంట్రా ఇలాంటి సినిమాలే చేస్తున్నానని అనుకునే సందర్భాలు చాలా వచ్చాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్లా. ఆ సమయంలోనే రాజేష్ ఈ నింద కథను చెప్పారు. ఈ కథ విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేసేద్దామని అన్నాను.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

‘నింద’లో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్‌గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్‌గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను. (Varun Sandesh Interview)

దర్శకుడే నిర్మాతగా.. ఈ విషయం మీకు ముందే తెలుసా?

కథ విన్నప్పుడు ఈ మూవీని ఎవరు నిర్మిస్తారు.. ఎవరు తీస్తారు అనే ఆలోచనలు రాలేదు. నాకు కథ నచ్చింది. రాజేష్ కథను నెరేట్ చేసిన విధానం మరింతగా నచ్చింది. ఇక ఆయనే సినిమాను నిర్మిస్తున్నాడని తెలిసి మరింత ఆనందం వేసింది. తన కథ మీద తనకు ఉన్న నమ్మకంతోనే నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆయనలో గట్స్, ధైర్యం ఉండటం వల్లే దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమాను చేశారు.

ఈ సినిమాలో కొత్తగా ఏం చెప్పబోతున్నారు?

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాకు మాత్రం స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉండబోతోంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు. అసలు పూర్తి కథను, స్క్రిప్ట్‌ని ఆర్టిస్టులెవ్వరికీ నెరేట్ చేయలేదు. దీంతో నటించే ఆర్టిస్టుల్లోనూ ఓ క్యూరియాసిటీ పెరిగింది. అసలు నేరస్థుడు ఎవరు? అనే విషయం తెలియకపోవడంతో సహజంగా నటించారు. కథ చెప్పినప్పుడు నేను గెస్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ నేను కూడా చెప్పలేకపోయాను. (Varun Sandesh about Nindha)


Nindha-Varun-Sandesh.jpg

టెక్నికల్‌ ఎఫర్ట్స్..?

‘నింద’ లాంటి చిత్రాలకు ఆర్ఆర్, కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. మాకు మంచి టెక్నీషియన్లు దొరికారు. సాంతు ఓంకార్ తన ఆర్ఆర్, మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. రమీజ్ కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. కథకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు సెట్ అయ్యారు.

ఈ సినిమా షూటింగ్‌లో ఎదురైన సవాళ్లు?

కానిస్టేబుల్ అనే సినిమా షూటింగ్‌లో నా కాలికి గాయమైంది. ఆ వెంటనే నింద షెడ్యూల్ ఉంది. అప్పటికే ఆర్టిస్టులంతా రెడీగా ఉన్నారు. అంతా సెట్ అయి ఉంది. నా ఒక్కడి కోసం షూటింగ్ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక.. రాజేష్ గారి డెడికేషన్, ఫ్యాషన్ చూసి.. ఆ గాయంతోనే షూటింగ్ చేశాను. రాజేష్ కోసమే ఆ రిస్క్ తీసుకున్నా.

దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథంతో ప్రయాణం ఎలా ఉంది?

రాజేష్ రూపంలో నాకు ఓ మంచి వ్యక్తి పరిచయం అయ్యారు. నాకు సొంత బ్రదర్‌లా మారిపోయారు. ఓ వయసు దాటాకా.. మనకంటూ కొత్త స్నేహితులు ఏర్పడరు. కానీ నాకు రాజేష్ వంటి మంచి వ్యక్తి ఈ చిత్రంతో పరిచయమయ్యారు.

మైత్రీ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయడంపై..?

మా దర్శకనిర్మాత రాజేష్ ఫ్రెండ్ యూఎస్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ నవీన్‌ గారికి తెలుసు. అలా మైత్రీ శశి గారు మా సినిమాను చూశారు. మూవీ నచ్చితేనే రిలీజ్ చేస్తామని శశిగారు అన్నారు. ఆయన చిత్రాన్ని చూశారు. బాగా నచ్చింది. అందుకే మా సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్?

‘నింద’ తర్వాత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. నిందలోని క్యారెక్టర్‌కు, ఆ సినిమాలోని పాత్రకు అస్సలు పోలిక ఉండదు. అది జూలైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అది కాకుండా ‘కానిస్టేబుల్’ అనే ఓ సినిమా చేస్తున్నాను.

Read Latest Cinema News

Updated Date - Jun 18 , 2024 | 06:16 PM