Nindha: వరుణ్ సందేశ్ ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ABN , Publish Date - May 10 , 2024 | 10:29 PM

వరుణ్ సందేశ్ ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌ సినిమాతో రాబోతున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ ‘నింద’ అనే కంటెంట్ బేస్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహిస్తున్నారు.

Nindha: వరుణ్ సందేశ్ ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Varun Sandesh in Nindha Movie

వరుణ్ సందేశ్ (Varun Sandesh) ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌ సినిమాతో రాబోతున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ ‘నింద’ (Nindha) అనే కంటెంట్ బేస్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం (Rajesh Jagannadham) నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహిస్తున్నారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ టైటిల్ లోగో, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రం రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. (Varun Sandesh In Nindha)

అదేంటంటే.. వరుణ్ సందేశ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే వరుణ్ సందేశ్ అమాయకంగా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ ముసుగు వ్యక్తి రూపం కనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్‌ను రివర్స్ చేసి చూస్తే న్యాయదేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం కూడా కనిపిస్తోంది. మరి ఈ ముసుగు వ్యక్తి ఎవరు? న్యాయ దేవతను ఎందుకు చూపిస్తున్నారు? వరుణ్ సందేశ్ క్యారెక్టర్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ఈ పోస్టర్ ఉంది. (Nindha Movie First Look Poster)


Varun-Sandesh-nindha.jpg

ఇలా పోస్టర్‌తోనే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే 15న ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. వరుణ్ సందేశ్ సరసన ఆనీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 10 , 2024 | 10:29 PM