Dangal: ముగియని 'దంగల్'.. అమీర్ ఖాన్ వర్సెస్ బబితా

ABN , Publish Date - Oct 23 , 2024 | 05:17 PM

దంగ‌ల్‌ సినిమా సంచలనం విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్లను కొల్లగొట్టింది. అయితే, తాజాగా రెజ్లర్ బబితా ఫోగట్ సినిమా మేకర్స్‌పై ఆక్రోశం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏమైందంటే..

Vabitha Vs Dangal team

అమీర్ ఖాన్ (Aamir Khan) మెయిన్ లీడ్‌గా ఫాతిమా స‌నా షేక్‌, జైరా వాసిమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం దంగ‌ల్‌ (Dangal). ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహించగా. అమీర్ ఖాన్, సిద్దార్థ్ రాయ్ కపూర్‌తో కలిసి ఈ సినిమాని నిర్మించారు. భారత రెజ్లర్లు గీత ఫోగట్, బబితా ఫోగట్, తండ్రి మహావీర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా ఏ సినిమా సంచలనం విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్లను కొల్లగొట్టింది. అయితే, తాజాగా రెజ్లర్ బబితా ఫోగట్ సినిమా మేకర్స్‌పై ఆక్రోశం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏమైందంటే..


తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో 'తమ కథను ఆధారం చేసుకుని వేల కోట్ల బిజినెస్ చేసి కేవలం మీకు కోటి రూపాయలు ఇవ్వడం బాధ కలిగించలేదా అని' ఓ జర్నలిస్ట్ బబితాను ప్రశ్నించగా.. లేదు, సమాజం నుంచి మనం ప్రేమ, గౌరవాన్ని మాత్రమే ఆశించాలి అని మా నాన్న చెప్పారు అని సమాధానం ఇచ్చింది. అయితే, తమ సొంత గ్రామంలో అకాడమీ ఏర్పాటుకు డబ్బుల్లేక మూవీ టీంను సాయం అడిగితే వారు సమాధానం ఇవ్వకపోవడం బాధనిపించినట్టు తెలిపింది. అకాడమీ నిర్మాణానికి దాదాపు రూ. 5 కోట్లు ఖర్చవుతుందని వివరించింది. దీంతో సోషల్ మీడియాలో మేకర్స్‌పై తీవ్ర దూమారం రేగుతోంది.


2016లో విడుదలైన దంగల్ సినిమా బబితా ఆమె అక్క గీతా ఫొగాట్ వారి తండ్రి మహవీర్ ఫొగాట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. కుమార్తెలను మేటి రెజ్లర్లుగా తీర్చిదిద్దడానికి మహవీర్ చేసిన పోరాటం చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. బబిత 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 2014లో స్వర్ణం సంపాదించి మరింత కీర్తిపొందింది. 2019లో బబిత రెజ్లింగ్ ను వీడి రాజకీయాలవైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Oct 23 , 2024 | 05:17 PM