Sai Abhyankar: క్రేజీ ప్రాజెక్ట్ కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్...

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:12 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కించబోతున్న చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే లారెన్స్, సూర్య చిత్రాలకు సంగీతం అందిస్తున్న అభ్యంకర్ కెరీర్ ను ఇది మలుపు తిప్పే ప్రాజెక్టే!

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, ప్రముఖ దర్శకుడు అట్లీ (Atlee) తో సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మించబోతున్న సినిమా ప్రకటన బన్నీ బర్త్ డే సందర్భంగా వెలువడింది. ఈ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన వీడియో ఒక్కసారిగా టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలలో ప్రకంపనలు సృష్టించింది. బన్నీ, అట్లీ హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కలిసి తీరు, వారి ఫీడ్ బ్యాక్ చూసిన తర్వాత ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం రూఢీ అయ్యింది. అయితే... ఈ ప్రకటన వచ్చిన దగ్గర నుండి ఈ మూవీలో నటించబోయే ఆర్టిస్టులు ఎవరు? టెక్నీషియన్స్ ఎవరు అనే ఆరా మొదలైంది. ఈ యేడాది చివరిలో సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమాలో తాజా సమాచారం మేరకు సంగీతాన్ని సాయి అభ్యంకర్ (Sai Abhyankar) ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 21 సంవత్సరాల అభ్యంకర్ మరెవరో కాదు... ప్రముఖ గాయనీ గాయకులు హరిణి (Harini), టిప్పు (Tippu) తనయుడు. సినిమాల్లోకి అడుగుపెట్టక ముందే ప్రైవేట్ వీడియో సాంగ్ కు మ్యూజిక్ ఇచ్చి సంచలనం సృష్టించాడు అభ్యంకర్. ఈ కుర్రాడి సత్తాను గుర్తించిన కోలీవుడ్ అక్కున చేర్చుకుంది. లారెన్స్ (Lawrence) నటిస్తున్న 'బెంజ్' (Benz) మూవీకి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 'బెంజ్' సినిమా లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) ఫిల్మ్ యూనివర్శల్ లోదే! అయితే ఇప్పటికే ఇందులోని చిత్రాలకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichandar), సామ్ సీ.ఎస్. (Sam C.S.) మ్యూజిక్ ఇచ్చారు. అలాంటి లెజెండ్స్ తర్వాత మూడో స్థానంలో తనకు దక్కడం పట్ల అభ్యంకర్ హర్షం వ్యక్తం చేశాడు.


విశేషం ఏమంటే... తాజాగా సూర్య (Surya), ఆర్.జె. బాలాజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా నుండి ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rehman) తప్పుకోవడంతో వీళ్ళు... అభ్యంకర్ ను తమ టీమ్ లోకి తీసుకున్నారు. రెహమాన్ లోటును పూడ్చే సత్తా ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఉందని సూర్య నమ్మినట్టుగా తెలుస్తోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ను తన కిట్ లో వేసుకుంటున్న అభ్యంకర్... ఇప్పుడు బన్నీ, అట్లీ ప్రాజెక్ట్ కు సంగీతాన్ని అందించబోతున్నాడనేది నిజంగా గ్రేట్ న్యూస్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం త్వరలోనే వెలువడుతుందని అంటున్నారు. ఏదేమైనా... అట్లీ ఓ న్యూ ఎక్స్ పీరియెన్స్ ను బన్నీ మూవీతో ఫిల్మ్ గోయర్స్ కు ఇవ్వాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ న్యూ టాలెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Also Read: Vishwambhara: రిలీజ్ సెంటిమెంట్ రిపీట్!?

Also Read: Sapthagiri: మాతృవియోగం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 09 , 2025 | 12:12 PM