NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

ABN , First Publish Date - 2023-03-23T19:24:03+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) హీరోగా.. కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా (Pan India) మూవీ ‘NTR30’. గురువారం (మార్చి 23) ఈ సినిమా భారీ స్థాయిలో పూజా కార్య‌క్ర‌మాల‌ను

NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు
NTR30 Movie Opening

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) హీరోగా.. కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా (Pan India) మూవీ ‘NTR30’. గురువారం (మార్చి 23) ఈ సినిమా భారీ స్థాయిలో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌ (NTR arts), యువ సుధ ఆర్ట్స్ (Yuva Sudha) బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌ (Hari Krishna K), సుధాక‌ర్ మిక్కిలినేని (Mikkilineni Sudhakar) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎన్టీఆర్ 30 లాంచింగ్‌ కార్య‌క్ర‌మానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్స్ ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి (SS Rajamouli)తో పాటు ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్‌ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క్లాప్ కొట్టగా, కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్ర‌శాంత్ నీల్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను యూనిట్‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు మాట్లాడిన మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవడం ఖాయం అని చెప్పొచ్చు. (NTR30 Movie Launch)

NTR30f.jpg

సాంకేతిక నిపుణులలో ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) మాట్లాడుతూ... కొరటాల శివగారిని ఏడాది క్రితం కలిశాను. అప్పటి నుంచి వండర్‌ఫుల్‌ టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాం. ఆయన విజన్‌లో నేను చిన్న భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. హ్యూజ్‌ విజన్‌ ఆయనది. ఈ సినిమాకు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. లెజండరీస్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మోషన్‌ పోస్టర్‌‌కి వచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. తారక్‌కి ధన్యవాదాలు. నేను తిరిగి వస్తున్నాను.

ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ (Editor Sreekar Prasad) మాట్లాడుతూ.. ఎమోషనల్‌ స్టోరీని శివగారు ఎలా ముందుకు తీసుకెళ్తారో నాకు తెలుసు. శివగారి విజన్‌ని మేం అందరం ముందుకు తీసుకెళ్తామని భావిస్తున్నాను.

NTR30g.jpg

సినిమాటోగ్రపీ రత్నవేలు (Cinematographer Ratnavelu) మాట్లాడుతూ.. ఇంత మంది లెజండరీస్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. టెక్నికల్‌గా చాలెంజింగ్‌ సినిమా. సీ బ్యాక్‌గ్రౌండ్‌లో చేస్తున్నాం. ల్యాండ్‌లో రెండు షాట్స్ చేసేది, సముద్రంలో చేయడానికి అరపూట పడుతుంది. టెక్నికల్‌గా బ్రిలియంట్‌ సినిమా అవుతుంది. శివగారి విజన్‌ని స్క్రీన్‌ మీదకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం.

ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ (Production designer Sabu Cyril) మాట్లాడుతూ.. నాకు గ్రేట్‌ ఛాలెంజ్‌ ఇచ్చారు. టెక్నీషియన్లు అందరం ఒకరికొకరు సహకరించుకుంటాం. నాకు ఛాలెంజ్‌లంటే ఇష్టం. ఏడాదిగా ఈ సినిమాకు పనిచేస్తున్నాం.

NTR30d.jpg

వి.ఎఫ్.ఎక్స్ యుగంధర్ (VFX Supervisor Yugandhar) మాట్లాడుతూ.. నేను 25 ఏళ్లుగా విజువల్‌ ఎఫెక్స్ట్ చేస్తున్నాను. విజువల్‌ ఎఫెక్స్ట్ నేను చేసిన వాటిలో ఎప్పుడూ శాటిస్‌పేక్షన్‌ రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంలోని బెస్ట్ స్టూడియోలను మేం లాక్‌ చేస్తున్నాం. నా మీద నమ్మకం ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను కూడా ప్రూవ్‌ చేసుకుంటాను.

కాగా.. ఈ ‘NTR30’ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Kantara 2: కీలక అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-23T19:24:04+05:30 IST