Boss is back: చంద్రబాబుకి బెయిల్, చిరంజీవి డైలాగ్ వైరల్

ABN , First Publish Date - 2023-10-31T16:03:26+05:30 IST

సుమారు 53 రోజుల తరువాత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. ఈ నేపథ్యంలో సాంఘీక మాధ్యమంలో చిరంజీవి 150వ సినిమాలోని ఒక డైలాగ్ సాంఘీక మాధ్యమంలో వైరల్ అయింది. ఆ డైలాగ్ ఏంటంటే...

Boss is back: చంద్రబాబుకి బెయిల్, చిరంజీవి డైలాగ్ వైరల్
File pictures of Chandrababu Naidu and Chiranjeevi

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి (NaraChandrababuNaidu) ఈరోజు హైకోర్టు (HighCourt) లో ఊరట లభించిన విషయం తెలిసిందే. హై కోర్టు చంద్రబాబుకి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. (Chandrababu gets ఈరోజు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతారని అందరూ అనుకుంటున్నారు. ఒక పక్క తెలుగు దేశం పార్టీ నాయకులూ, కార్యకర్తలు చంద్రబాబు కి స్వాగతం పలకడానికి రాజమండ్రి చేరుకుంటూ ఉంటే, ఇంకో పక్క చిరంజీవి చెప్పిన ఒక డైలాగు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. (Chandrababu gets interim bail for four weeks in skill development case)

chandrababu-nimmakuru.jpg

మెగాస్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) నటించిన 150 వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' #KhaidiNo.150 నుండి చిరంజీవి చెప్పిన ఒక డైలాగ్ వైరల్ అవుతోంది. ఆ డైలాగు చంద్రబాబు జైలు నుంచి ఒక సింహంలా వస్తున్నారని చెప్పడానికి, ధైర్యంగా ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొని పోరాడగలిగే గుండె ధైర్యం అతనికి ఉందని చెప్పడానికి, తెలుగు దేశం సానుభూతిపరులు ఈ చిరంజీవి డైలాగుని సాంఘీక మాధ్యమామల్లో వైరల్ చేస్తున్నారు.

Chiranjeevi.jpg

చంద్రబాబు ఫోటోలను, వీడియోలను పెట్టి, చిరంజీవి చెప్పిన ఈ ఆడియో డైలాగును దానికి జతపరిచి సాంఘీక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. 'గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు తట్టుకున్న గుండెరా ఇదీ!' అని చెప్పే చిరంజీవి డైలాగుని ఇప్పుడు చంద్రబాబు కి సరిపోయేట్టుగా చేస్తూ బెయిల్ మీద వస్తున్న తమ నాయకుడు ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనగలడు అని చెపుతున్నారు.

చంద్రబాబుని రాష్ట్ర సిఐడి పోలీసులు సెప్టెంబర్ నెలలో నంధ్యాల దగ్గర అరెస్టు చేసి, తరువాత రాజమండ్రి (RajahmundryCentralJail) సెంట్రల్ జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. సుమారు 53 రోజుల తరువాత ఈరోజు చంద్రబాబుకి వున్నా ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చెయ్యటం జరిగింది.

Updated Date - 2023-10-31T16:04:57+05:30 IST