Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు
ABN , First Publish Date - 2023-03-12T10:02:29+05:30 IST
ఓటీటీల హవా పెరిగిన తర్వాత ఎంతోమంది పాపులర్ హీరోలు సైతం వెబ్‌సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.
ఓటీటీల హవా పెరిగిన తర్వాత ఎంతోమంది పాపులర్ హీరోలు సైతం వెబ్‌సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతోమంది నటులు ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఈ జాబితాలో తాజాగా టాలీవుడ్ హీరోలు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కూడా చేరిపోయారు. వీరిద్దరూ కలిసి ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్‌సిరీస్ ద్వారా ఓటీటీకి పరిచయమయ్యారు. ఇందులో తండ్రి నాగ నాయుడుగా వెంకటేశ్, కొడుకు రానా నాయుడుగా రానా నటించారు. (Rana Naidu Webseries)
అమెరికన్ వెబ్‌సిరీస్ ‘ర్యాన్ అండర్సన్’ వెబ్‌సిరీస్‌కి రిమేక్‌గా ‘రానా నాయుడు’ ని తెరకెక్కించారు. ప్రకటించనప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్న ఈ సిరీస్ మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ఇప్పటికే చూసేసిన పలువురు నెటిజన్లు దగ్గబాటి హీరోలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్‌పై ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్‌లో ఫ్యామిలీ కథలు, సినిమాలు అంటే మొదట గుర్తొచ్చే పేరు వెంకటేశ్. ఆయన సినిమా అంటే కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ, ఈ వెబ్‌సిరీస్ మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఇందులో చాలా అడల్ట్ కంటెంట్ ఉంది. దీంతో ఇది నచ్చని చాలామంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఈ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇది కుటుంబ కథ కాదని రానా, వెంకటేశ్‌తో పాటు టీం మొత్తం చెప్పి మరీ ప్రచారం చేసింది. అయినా ఈ విమర్శలు ఆగట్లేదు. కాగా.. నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.. (Rana Naidu Webseries)
‘రానా దగ్గుబాటి గారు ఫ్యామిలీ కలిసి చూడవలసిన సినిమా కాదు అని ముందుగానే చెప్పారు చాలా సంతోషం. కానీ ఇలాంటి సొల్లు, చెత్త సినిమాలు తీయకపోయుంటే ఇంకా బాగుండేది కదా. వెంకటేశ్ గారు ఫ్యామిలీ మ్యాన్ అయ్యుండి ఇంత దిగజారి సినిమా తీయాల్సిన అవసరం ఏముందో అర్ధంకాలేదు’.. ‘ఇందులో వెంకటేశ్‌ని చూస్తే.. వీరసింహారెడ్డిలో దునియా విజయ్‌ని చూసినట్లు ఉంది’.. ‘వెబ్‌సిరీస్ మేకర్స్‌కి ఏమవుతోంది. ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులతో సిరీస్‌ని ఎందుకు నింపేస్తున్నారు’ అంటూ విమర్శలు చేస్తూ పోస్టులు చేస్తున్నారు. (Rana Naidu Webseries)
మరోవైపు.. ‘వెంకటేశ్ ఎప్పుడూ పాత పద్ధతిలోనే కథలు ఎంచుకోవాలా? కొత్తగా ప్రయత్నించకూడదా’.. ‘ఇది అడల్ట్ కథ అని ముందే చెప్పారుగా’.. ‘వెంకటేశ్ ఫ్యామిలీ సినిమా తీస్తే సిరీయల్‌లా ఉందని విమర్శించారుగా’ అని దగ్గుబాటి హీరోలకి సపోర్టు చేస్తున్నారు.
మరోవైపు.. ‘వెంకటేశ్ ఎప్పుడూ పాత పద్ధతిలోనే కథలు ఎంచుకోవాలా? కొత్తగా ప్రయత్నించకూడదా’.. ‘ఇది అడల్ట్ కథ అని ముందే చెప్పారుగా’.. ‘వెంకటేశ్ ఫ్యామిలీ సినిమా తీస్తే సిరీయల్‌లా ఉందని విమర్శించారుగా’ అని కొందరు దగ్గుబాటి హీరోలకి సపోర్టు చేస్తున్నారు.