MegaStar: బాస్ మళ్ళీ కుమ్ముడు, 200 డాన్సర్స్ తో చిరు

ABN , First Publish Date - 2023-02-08T18:14:14+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'భోళాశంకర్' (Bholashankar) షూటింగ్ మొదలెట్టారు. మెహెర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్, పాటతో మళ్ళీ మొదలయింది.

MegaStar: బాస్ మళ్ళీ కుమ్ముడు, 200 డాన్సర్స్ తో చిరు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'భోళాశంకర్' (Bholaa Shankar) షూటింగ్ మొదలెట్టారు. మెహెర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్, పాటతో మళ్ళీ మొదలయింది. 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) ఇచ్చిన ఘనవిజయం పెద్ద కిక్ ఇచ్చి, చిరంజీవి ఈరోజు సెట్ లోని పాటకు కుమ్ముడే కుమ్ముడు అని అంటున్నారు యూనిట్ సభ్యులు. సుమారు రెండు వందలమంది డాన్సర్స్ ఈ పాటలో పాల్గొన్నారని తెలిసింది. ఈ పాటకి మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) సంగీతం సమకూర్చగా, శేఖర్ మాస్టర్ (Sekhar master) కోరియోగ్రఫీ చేసినట్టుగా తెలిసింది. అసలు చిరంజీవి డాన్స్ చూస్తుంటే ఈ వయసులో కూడా ఇంతలా ఎలా ఆలా డాన్స్ చేస్తున్నారో అని యూనిట్లో వున్న సభ్యులు, డాన్సర్స్ ఆశ్చర్యపోతున్నారట.

bhola1.jpg

'వాల్తేరు వీరయ్య' విజయం తరువాత చిరంజీవి కొన్ని రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయం లో కూడా 'భోళా శంకర్' స్క్రిప్ట్ గురించే చర్చలు జరిగాయని కూడా తెలిసింది. మెహెర్ రమేష్, రచయితలతో కూర్చొని ఈ సినిమాలో కొంచెం ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి కొన్ని సన్నివేశాలు పెట్టినట్టుగా కూడా తెలిసింది. 'వాల్తేరు వీరయ్య' పరిశ్రమలో ఒక పెద్ద హిట్ గా నిలవటం తో చిరంజీవి ఆ ఉత్సాహంతోనే ఈ 'భోళా శంకర్' ని కూడా అంత పెద్ద హిట్ చెయ్యాలన్న దిశగా ఈ సినిమా కథను మారుస్తున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా కూడా పాటలు 'వాల్తేరు వీరయ్య' కన్నా పెద్ద హిట్ అవుతాయని, ఇందులో కూడా బాస్ కుమ్ముడు ఉంటుందని తెలిసింది.

Updated Date - 2023-02-08T18:14:16+05:30 IST