Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లాడబోయే వ్యక్తి ఇతనే..
ABN , First Publish Date - 2023-11-15T14:38:41+05:30 IST
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక నాయర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె పెళ్లికి సంబంధించి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిందనే విషయాన్ని స్వయంగా కార్తీక నాయరే తన సోషల్ మీడియా వేదికగా కొన్ని రోజుల క్రితం తెలియజేసింది. తాజాగా తనకు కాబోయే రోహిత్ మీనన్ ఫొటోలను కార్తీక నాయర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సీనియర్ నటి రాధ (Radha) కుమార్తె కార్తీక నాయర్ (Karthika Nair) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె పెళ్లికి సంబంధించి ఇప్పటికే నిశ్చితార్థం (Engagement) కూడా జరిగిందనే విషయాన్ని స్వయంగా కార్తీక నాయరే తన సోషల్ మీడియా వేదికగా కొన్ని రోజుల క్రితం తెలియజేసింది. అయితే తనకు పెళ్లాడబోయే వ్యక్తికి సంబంధించిన ఫొటోని మాత్రం ఆమె షేర్ చేయలేదు. ఇద్దరు కౌగిలించుకుని ఉన్న పిక్‌ని షేర్ చేసిన కార్తీక (Karthika).. అందులో తన ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించి.. తనకు నిశ్చితార్థం అయినట్లుగా వెల్లడించింది.
రాధలానే హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలని ఇండస్ట్రీలోకి వచ్చిన కార్తీకకు మొదట్లో మంచి సినిమాలే పడ్డాయి. ‘రంగం’ (Rangam) రూపంలో ఆమెకు మంచి బ్రేక్ కూడా లభించింది. అలాగే టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ (Dammu) సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ రావడంతో.. ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ (Brother of Bommali) అనే చిత్రంలో మాత్రమే కార్తీక కనిపించింది. ఆ సినిమా తర్వాత ఆమె దాదాపు వెండితెరకు దూరమైంది. మరి అవకాశాలు రాలేదో.. మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. మధ్యలో ఆమెపై వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ, మళ్లీ కార్తీక వెండితెరపై అడుగులు వేయలేదు. కట్ చేస్తే..
రోహిత్ మేనన్ (Rohit Menon)తో ఆమెకు నిశ్చితార్థం అయిపోయింది. అంటే ఇక నటనకు గుడ్ బై చెప్పేసి.. పెళ్లి చేసుకుని నెక్స్ట్ ఫేజ్‌లోకి అడుగేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా కోలీవుడ్‌లో ఆమెపై వార్తలు వినిపించాయి. అయితే నిశ్చితార్థం తర్వాత కూడా తనకు కాబోయే వాడిని పరిచయం చేయని కార్తీక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా రోహిత్ మేనన్‌ని రివీల్ చేసింది. ‘‘నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్.. నీతో కలిసి నడవడానికి కౌంట్‌డౌన్ మొదలెట్టా..’’ అని తెలుపుతూ.. రోహిత్ మేనన్‌తో ఉన్న ఫొటోలను కార్తీక షేర్ చేసింది. దీంతో రాధ కుమార్తెకు కాబోయే వ్యక్తి ఇతనే అంటూ అంతా ఈ కాబోయే నూతన జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం కార్తీక పోస్ట్, ఈ పోస్ట్‌లో ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
========================
*Mehreen Pirzada: అదే నాకు ‘స్పార్క్’ మూమెంట్..
**********************************
*Malavika Mohanan: అభిమానుల మనసుల్లో మాళవిక గిలిగింతలు
********************************
*Aishwarya Rai: ఐష్ టాయిలెట్స్ కడగడానికి కూడా ఆ క్రికెటర్ పనికిరాడంటూ.. నెటిజన్లు ఫైర్
*********************************