ఒక వైపు అధికారం.. మరో వైపు నిజం!

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:41 AM

చట్టానికి తప్ప ఎవరికీ తలవంచని అధికారి, వృత్తిని దైవంలా భావించే ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ అమీ పట్నాయక్‌ మళ్లీ వచ్చేశాడు. 2018లో వచ్చిన హిట్‌ మూవీ ‘రైడ్‌’కు...

చట్టానికి తప్ప ఎవరికీ తలవంచని అధికారి, వృత్తిని దైవంలా భావించే ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ అమీ పట్నాయక్‌ మళ్లీ వచ్చేశాడు. 2018లో వచ్చిన హిట్‌ మూవీ ‘రైడ్‌’కు సీక్వెల్‌ రెడీ అయింది. ‘రైడ్‌ 2’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ అమీ పట్నాయక్‌గా అజయ్‌ దేవగణ్‌ మళ్లీ నటిస్తున్నారు. రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వంలో పనోరమ స్టూడియోస్‌, టీ సిరీస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.. ‘రైడ్‌’లో ఇలియానా కథానాయికగా నటిస్తే, సీక్వెల్‌లో ఆ పాత్రను వాణీ కపూర్‌ చేజిక్కించుకున్నారు. ‘ఒకవైపు అధికారం.. మరో వైపు నిజం. ఈ ప్రయాణం ఇప్పుడు మరింత పెద్దదిగా మారింది’ అని పేర్కొంటూ ట్రైలర్‌ను సోషల్‌ మీడియా ద్వారా మంగళవారం విడుదల చేశారు.

Updated Date - Apr 09 , 2025 | 04:41 AM