R. Madhavan: మరో బయోపిక్‌ చేస్తున్న మ్యాడీ

ABN , First Publish Date - 2023-04-07T19:27:57+05:30 IST

విభిన్న పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఆర్. మాధవన్ (R. Madhavan). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో సినిమాలు చేస్తున్నారు. ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’, ‘సాలా కదూస్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

R. Madhavan: మరో బయోపిక్‌ చేస్తున్న మ్యాడీ

విభిన్న పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఆర్. మాధవన్ (R. Madhavan). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో సినిమాలు చేస్తున్నారు. ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’, ‘సాలా కదూస్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. చివరగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect)లో నటించారు. నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రాకెట్రీ సినిమా రూపొందింది. తాజాగా మాధవన్ మరో బయోపిక్‌లో నటించనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన వెలువడింది.

జీడీ. నాయుడు (GD. Naidu) సినిమాలో మాధవన్ నటించనున్నారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించనున్నారు. జీడీ. నాయుడుని ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మ్యాన్, కోయంబత్తూరులో సంపద‌ను సృష్టించిన వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. ఇండియాలో మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ను రూపొందించినది ఆయనే. ఈ సినిమాను మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుంది.

GD.-Naidu.jpg

మాధవన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ఓ కామెడీ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మంజు వారియర్ (Manju Warrier) ఆయనకు జోడీగా నటిస్తున్నారు. డెబ్యుటెంట్ కపిల్ గార్గ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 50శాతం పూర్తయింది. ఈ సినిమాలో మ్యాడీ భారత్‌లో జన్మించిన అమెరికన్ సైకాలజీ ప్రొఫెసర్‌గా నటిస్తున్నారు. మంజు వారియర్ భోపాల్‌కు చెందిన న్యాయవాది పాత్రను పోషిస్తున్నారు. ఆర్. జవహర్ దర్శకత్వంలోను ఓ మూవీ చేయనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-07T19:30:43+05:30 IST