Hit 3: నేచురల్ స్టార్ నాని విధ్వంసం

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:41 PM

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ 'హిట్ 3' ఐదు భాషల్లో మే 1న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

Hit 3: నేచురల్ స్టార్ నాని విధ్వంసం

నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన 'హిట్ 3' (Hit 3) ట్రైలర్ వచ్చేసింది. 'హిట్' (Hit) సినిమాను విశ్వక్ సేన్ తో తెరకెక్కించిన డాక్టర్ శైలేష్ కొలను (Dr. Sailesh Kolanu), దాని ఫ్రాంచైజ్ గా 'హిట్ : ది సెకండ్ కేస్'ను అడివి శేష్ తో రూపొందించాడు. ఆ సినిమా ఎండింగ్ లోనే 'హిట్ : ది థర్డ్ కేస్'ను నానితో తీయబోతున్నట్టు తెలిపారు. 'హిట్' ఫ్రాంచైజ్ కు ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 'హిట్ 3'తో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మే 1 పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. నేచురల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్న నాని దానిని క్రాస్ చేసి... క్రిమినల్స్ ను ఎలా ఊచకోత కోసాడో 'హిట్ 3' ట్రైలర్ లో చూడొచ్చు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) సంగీతం అందించారు.

Updated Date - Apr 14 , 2025 | 12:52 PM