Kubera: పోయిరా పోయిరా మావా..

ABN , Publish Date - Apr 21 , 2025 | 02:10 AM

నాగార్జున, ధనుష్‌, రష్మిక మందన్నా ప్రధాన పాత్రధారులుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు...

నాగార్జున, ధనుష్‌, రష్మిక మందన్నా ప్రధాన పాత్రధారులుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మాతలు. జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ‘పోయిరా పోయిరా మావా... రాజాలాగా దార్జాగ పోయిరా మావా..’ అంటూ సాగే గీతాన్ని భాస్కరభట్ల రాయగా ధనుష్‌ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ధనుష్‌ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.

Updated Date - Apr 21 , 2025 | 08:50 AM