Mohanlal: ఏప్రిల్ 25న తెలుగులోనూ తుడరుమ్...
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:38 AM
ప్రముఖ నటుడు మోహన్ లాల్ నటించిన 'ఎల్ 2: ఎంపురాన్' సినిమా ఇటీవలే విడుదలైంది. తాజాగా ఈ నెల 25న ఆయన మరో సినిమా 'తుడరుమ్' జనం ముందుకు రాబోతోంది.
మలయాళ సీనియర్ నటుడు మోహన్ లాల్ (Mohanlal), శోభన (Sobhana) జంటగా నటించిన సినిమా 'తుడరుమ్' (Thudarum). 1987 తర్వాత వీరిద్దరు తిరిగి మరోసారి భార్యాభర్తలుగా నటిస్తున్న సినిమా ఇది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన 'తుడరుమ్' మలయాళంలో ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది. ఇదే పేరుతో ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి అదే రోజు విడుదల చేయబోతున్నారు. ఓ టాక్సీ డ్రైవర్ జీవితానికి సంబంధించిన కథ ఇదని తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మంగళవారం తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. పైకి ఇది సాధారణమైన మధ్య తరగతి మనిషి కథ అనిపిస్తున్నా... ఆ టాక్సీ డ్రైవర్ గతంలో ఏదో మిస్టరీ దాగుందనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా తెలియచేశారు. ఎం. రంజిత్ నిర్మించిన 'తుడరుమ్' సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో దీపా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తోంది.
Also Read: ANR: శ్రీమహావిష్ణువు పాత్రలో ఏయన్నార్!
Also Read: Ram- Bhagya Shri: ఒకే గదిలో రామ్ , భాగ్యశ్రీ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి