Ram Pothineni: రామ్ చిత్రంలో ఉపేంద్ర
ABN , Publish Date - Apr 28 , 2025 | 09:48 AM
నట, దర్శకుడు ఉపేంద్ర ఏ పాత్ర చేసినా కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఆ మధ్య తెలుగులో 'గని' మూవీలో నటించిన ఉపేంద్ర కాస్తంత గ్యాప్ తర్వాత ఇప్పుడు రామ్ పోతినేని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట!
కన్నడ కథానాయకుడు, దర్శకుడు ఉపేంద్ర (Upendra) కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమాలలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన అనుభవం కూడా ఉపేంద్రకు ఉంది. కన్నడలో చిత్రసీమతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రను వేసిన ఉపేంద్ర ఈ మధ్య కాలంలో తెలుగులో ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన నటించిన కన్నడ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యి విడుదల అవుతున్నాయి. ఆ మధ్య అల్లు అర్జున్ (Allu Arjun) 'సన్నాఫ్ సత్యమూర్తి' (S/o Satyamurthy) చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఉపేంద్ర, ఆ తర్వాత వరుణ్ తేజ్ (Varun Tej) 'గని' (Ghani) చిత్రంలో నటించాడు.
ఇప్పుడు రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. భాగశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ' ఫేమ్ మహేశ్ బాబు (Mahesh babu) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా నుండి తొలి గీతం రామ్ పుట్టిన రోజు సందర్భంగా మే 15న విడుదల కాబోతోందట. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు వివేక్ - మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక తల్లడిల్లుతున్న రామ్ ను ఈ చిత్రం సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
Also Read: Shruti Haasan: నేనూ మనిషినే కదా.. కాస్త అర్థం చేసుకోవాలి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి