ప్రత్యేక పాత్రలో సమంత

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:46 AM

నటి సమంత తన సొంత బ్యానర్‌ ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకుడు....

నటి సమంత తన సొంత బ్యానర్‌ ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకుడు. మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదివారం ఈ చిత్రం నుంచి మేకర్స్‌ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. గ్రామంలోని మహిళలంతా టీవీలో సీరియల్‌ చూస్తూ దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంటారు. వారి నుంచి తప్పించుకునేందుకు పురుషులంతా అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా ప్రత్యేక పాత్రలో సమంత ప్రత్యక్షమవుతారు. హాస్యం, హారర్‌, ఉత్కంఠ, ఎమోషన్స్‌ ఇలా అన్ని అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ని చూస్తే తెలుస్తోంది.

Updated Date - Apr 28 , 2025 | 12:46 AM