పది కాలాల పాటు గుర్తుండే సినిమా

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:52 AM

ప్రియదర్శి కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘సారంగపాణి జాతకం’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం...

ప్రియదర్శి కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘సారంగపాణి జాతకం’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆదివారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ‘సారంగపాణి జాతకం’ పది కాలాల పాటు గుర్తు పెట్టుకునే సినిమా. మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. కుటుంబ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థియేటర్లకు వస్తున్నారు. మా సినిమాను సూపర్‌ హిట్‌ చేయండి’ అని ప్రేక్షకులను కోరారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి, ఇష్టపడి తీశాం. ప్రతి ఒక్కరు ఈ వేసవిలో మా సినిమాను చూసి ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘కోర్ట్‌’ తర్వాత ‘సారంగపాణి జాతకం’ ఓ వరంలా దొరికింది’ అనిప్రియదర్శి అన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:52 AM