ఆసక్తికరమైన ప్రయాణం ఇది- కీరవాణి
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:43 AM
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం గురించి ఆ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Cinema News: మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం గురించి ఆ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తను పని చేసిన చిత్రాల్లో ఇది కష్టతరమైన ప్రాజెక్ట్ అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రతి సినిమాకూ సవాళ్లు పెరుగుతుంటాయి. దానికి తగ్గట్లు కొత్త సౌండ్స్ సృష్టించాలి. మహేశ్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం లాంటిది ఇంతవరకూ రాలేదని అనుకుంటున్నా. అదొక అడ్వంచర్. అయినా ఆసక్తికరమైన ప్రయాణమే’ అన్నారు కీరవాణి. ‘నా టూర్ ఎం.ఎం.కె.’ పేరుతో నిర్వహించే మ్యూజిక్ కాన్సర్ట్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఇటీవల ఒడిశాలోని కోరాపుట్‌లో జరిగిన షూటింగ్‌తో మహేశ్‌బాబు చిత్రం రెండో షెడ్యూల్ పూర్తయిన విషయం విదితమే.