Bharadwaja Thammareddy: ఓ అందాల రాక్షసి.. మౌత్ పబ్లిసిటీతో ముందుకెళ్తుంది.
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:10 PM
నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్టుగానే సినిమా పెద్ద సక్సెస్ అయింది. షెరాజ్‌ను చూసి చాలా మంది నిర్మాతలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది -తమ్మారెడ్డి భరద్వాజ్

షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మ కీలక పాత్రధారులుగా నటించిన ‘ఓ అందాల రాక్షసి’ (o Andala Rakshasi) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తుంది. సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ మీట్ హైద్రాబాద్ లో జరిగింది.
తమ్మారెడ్డి భరద్వాజ్ (Bharadwaja Thammareddy) మాట్లాడుతూ "నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్టుగానే సినిమా పెద్ద సక్సెస్ అయింది. షెరాజ్‌ను చూసి చాలా మంది నిర్మాతలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. చిన్న చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు కూడా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. మంచి మౌత్ టాక్ రావడంతో షోలు, స్క్రీన్‌లు, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. అద్భుతమైన రెస్పాన్స్‌ను రాబట్టుకుంది" అని అన్నారు.
షెరాజ్ మెహదీ మాట్లాడుతూ ‘‘ఓ అందాల రాక్షసి’మంచి సందేశం ఇచ్చేలా ఉందని ప్రేక్షకులంతా ప్రశంసిస్తున్నారు. మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్ " అని అన్నారు.
కృతి వర్మ మాట్లాడుతూ .. ‘మా సినిమాతో పాటుగా చాలా చిత్రాలు వచ్చాయి. ఆడియెన్స్ మా మూవీని ఆదరించారు. ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్. నా తొలి చిత్రమే ఇంత పెద్ద హిట్ అవ్వడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.