NBK: బాలకృష్ణ సెప్టెంబర్ సెంటిమెంట్!

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:40 PM

నందమూరి బాలకృష్ణ 'అఖండ -2' సెప్టెంబర్ లో 25న విడుదల కాబోతోంది. ఆ సందర్భంగా సెప్టెంబర్ లో వచ్చిన బాలయ్య బాబు చిత్రాల గురించి తెలుసుకుందాం.

NBK: బాలకృష్ణ సెప్టెంబర్ సెంటిమెంట్!

నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) తాజా చిత్రం 'అఖండ-2' (Akhanda-2) సెప్టెంబర్ 25న జనం ముందు నిలవనుంది. సెప్టెంబర్ అనగానే బాలయ్య అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. ఎందుకంటే బాలయ్యకు సెప్టెంబర్ కలసి వస్తుందని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.

నేడు నటసింహగా జేజేలు అందుకుంటూ జైత్రయాత్ర చేస్తోన్న బాలకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పింది సెప్టెంబర్ మాసం. బాలయ్య సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించిన 'మంగమ్మగారి మనవడు' (Mangammagari Manavadu) 1984 సెప్టెంబర్ 7న రిలీజయింది. ఆ సినిమా 560 రోజులు మూడు ఆటలతో ఆడేసింది. ఇప్పటికీ తెలంగాణలో అత్యధిక రోజులు ఆడిన తెలుగు సినిమాగా 'మంగమ్మగారి మనవడు' నిలచి ఉండడం విశేషం! అంతటి ఘనవిజయాన్ని అందించిన సెప్టెంబర్ అంటే బాలయ్య అభిమానులకు ఓ సెంటిమెంట్. ఆ తరువాత కూడా సెప్టెంబర్ నెలలో విడుదలైన బాలయ్య చిత్రాలు భలేగా అలరించాయి. ఒక్క సినిమా మినహాయిస్తే బాలయ్య సెప్టెంబర్ రిలీజెస్ అన్నీ సక్సెస్ రూటులో సాగినవే అని చెప్పాలి. ఇప్పుడు సెప్టెంబర్ 25న 'అఖండ-2' వస్తోందని తెలియగానే బాలయ్య ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాకుండా ఉంది. పైగా బాలయ్యకు హ్యాట్రిక్ అందించిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా కావడంతో ఆ సంతోషం రెట్టింపుగానే సాగుతోంది.

Also Read: Shanmukha Movie Review: ఆది సాయికుమార్  'షణ్ముఖ'తో హిట్ కొట్టాడా!?


బాలయ్య కెరీర్ లో మొట్టమొదట విడుదలైన సెప్టెంబర్ సినిమా 'శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం' (Sree Tirupathi Venkateswara Kalyanam). 1979 సెప్టెంబర్ 28న 'శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం' విడుదలయింది. యన్టీఆర్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో బాలయ్య నారదునిగా నటించి ఆకట్టుకున్నారు. తరువాత వచ్చిన సినిమా 'మంగమ్మగారి మనవడు'- ఆ పై సెప్టెంబర్ లోనే పలకరించిన మరో సినిమా 1986లో వచ్చిన 'కలియుగ కృష్ణుడు'. ఈ సినిమా హిట్ గా నిలచింది.. మరో ఎనిమిదేళ్ళకు అంటే 1994లో సెప్టెంబర్ నెలలోనే విడుదలైన 'బొబ్బిలి సింహం' సూపర్ హిట్ గా మెరిసింది. ఈ చిత్రం బాలయ్యకు నటునిగానూ మంచి మార్కులు సంపాదించి పెట్టింది.

Also Read: Tuk Tuk Review: శాన్వీ మేఘన 'టుక్ టుక్' రైడ్ ఎలా ఉందంటే...


'బొబ్బిలి సింహం' తరువాత సెప్టెంబర్ లో విడుదలైన బాలయ్య చిత్రాలు 1999లో వచ్చిన 'క్రిష్ణబాబు', 2002లో విడుదలైన 'చెన్నకేశవ రెడ్డి' కూడా విజయాన్ని చవిచూశాయి. ఆ రోజుల్లో 'చెన్నకేశవ రెడ్డి' బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా బాలయ్య నటనకు మరింత వన్నెలు అద్దింది. కాగా 2017 సెప్టెంబర్ లో వచ్చిన 'పైసా వసూల్' అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ సినిమాలోనే బాలయ్య తొలిసారి గాయకునిగా మారారు. అలా ఎటు చూసినా సెప్టెంబర్ బాలయ్యకు ఓ స్పెషల్ అనే చెప్పాలి. ఏది ఏమైనా బాలయ్య కెరీర్ నే మలుపు తిప్పిన 'మంగమ్మగారి మనవడు' రిలీజయిన సెప్టెంబర్ లోనే 'అఖండ-2' వెలుగు చూస్తోంది. అందువల్ల 'అఖండ-2'పై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ యేడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకులను పలకరించబోయే 'అఖండ-2' ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి.

Also Read: Pelli Kani Prasad Review: పెళ్లి కానీ ప్రసాద్ సప్తగిరి చెబుతున్న ముచ్చట్లు...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 21 , 2025 | 01:40 PM