Vithika Sheru: వరుణ్‌ అన్నీ సర్దుకుని ఇండస్ట్రీ వదిలి పోలేదు!

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:53 PM

తన భర్త వరుణ్‌ సందేశ్ (varen Sandesh) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు వితిక శేరు (Vithika sheru)! వరుణ్‌  సందేశ్ ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదని, దుకాణం సర్దుకుని  ఇండస్ట్రీ వదిలి పోలేదని ఘాటుగా స్పందించారు.

Vithika Sheru: వరుణ్‌ అన్నీ సర్దుకుని ఇండస్ట్రీ వదిలి పోలేదు!


తన భర్త వరుణ్‌ సందేశ్ (varen Sandesh) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు వితిక శేరు (Vithika sheru)! వరుణ్‌  సందేశ్ ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదని, దుకాణం సర్దుకుని  ఇండస్ట్రీ వదిలి పోలేదని ఘాటుగా స్పందించారు. వరుణ్‌  హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నింద’ (Ninda). ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో వితిక శేరు మాట్లాడుతూ "చాలామంది వరుణ్‌ విషయంలో కామెంట్లు చేస్తుంటారు. మీరు చాలా ఫెయిల్యూర్స్‌ చూశారు. అవకాశాలు లేవని, ఫెయిలైన యాక్టర్‌గా ఉన్నారు’ అని అడుగుతున్నారు. వరుణ్‌  ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదు. ఏ బ్యాగ్రౌండ్‌ లేకుండా  ఇండస్ట్రీకి   వచ్చి 17 ఏళ్లు అవుతుంది. సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్నారు.. సినిమాలు చేస్తూనే ఉన్నారు. అవకాశాలు లేకుండా లేరు. ఎవరైతే ఇక సినిమాలు వద్దు అనుకుని సర్దుకుని వెళ్లిపోతారో వాళ్లు ఫెయిల్యూర్‌ యాక్టర్స్‌ అవుతారు. వరుణ్‌ ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదు. తను ఇండస్ట్రీని  నమ్ముకుని ఉన్నారు సినిమాలు చేస్తున్నారు. ఇక్కడి దాకా వచ్చారు అంటే దర్శక నిర్మాతలే కారణం. ఏ సినిమా చేసిన వంద శాతం ఎఫర్ట్‌ పెడతారు. తనకి మంచి రోజు వస్తుంది. హిట్‌ కొడతారు.ఈ సినిమా నేను చూశాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాను. ఈ చిత్రంతో వరుణ్‌ తప్పకుండా కమ్‌బ్యాక్‌ హీరో అవుతాడు’’ అని అన్నారు వితిక. రాజేష్ జగన్నాథం ఈ చిత్రానికి దర్శకుడు. 

Updated Date - Jun 17 , 2024 | 01:53 PM

News Hub