Toofan: అక్క‌డ హిట్.. మ‌రి ఇక్క‌డ‌! థియేట‌ర్ల‌లోకి విజయ్ ఆంటోనీ తుఫాన్‌

ABN , Publish Date - Aug 08 , 2024 | 06:40 PM

విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ తుఫాన్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. తెలుగులోనూ అదే సక్సెస్ రిపీట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

toofan

రోమియో వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటించిన లేటెస్ట్ మూవీ తుఫాన్ (Toofan) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. తెలుగులోనూ అదే సక్సెస్ రిపీట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.ఇప్ప‌టికే తుఫాన్ (Toofan) సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్నీక్ పీక్ సినిమాపై అంచనాలు పెంచింది.

Toofan.jpg

సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన "తుఫాన్" సినిమా శ్రీ సిరి సాయి సినిమాస్ ద్వారా రేపు (ఈ నెల 9న) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది.


Toofan-Movie.jpg

శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ వంటి న‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్‌లో దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ సినిమాను రూపొందించారు.

Updated Date - Aug 08 , 2024 | 06:40 PM