School Life: సినిమాపై పిచ్చితో.. ఇల్లు అమ్మి మరీ ఈ సినిమా తీశా

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:08 PM

క్రౌడ్ ఫండింగ్ ద్వారా పులివెందుల మహేష్ ఎంతో కష్టపడి తానే హీరో మరియు దర్శకుడుగా చేస్తున్న సినిమా స్కూల్ లైఫ్. నేడు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

School Life

పులివెందుల మహేష్ హీరో మరియు దర్శకుడుగా సావిత్రి కృష్ణ హీరోయిన్ గా నైనీషా క్రియేషన్స్ మరియు క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మాతలుగా నిర్మిస్తున్న సినిమా స్కూల్ లైఫ్ ( School Life). క్రౌడ్ ఫండింగ్ ద్వారా పులివెందుల మహేష్ ఎంతో కష్టపడి తానే హీరో మరియు దర్శకుడుగా చేస్తున్న సినిమా. నేడు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు వి సముద్ర విచ్చేసి టీమ్‌ను సపోర్ట్ చేసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు పులివెందుల మహేష్ మాట్లాడుతూ.. ఈరోజు కృష్ణానగర్ నుంచి వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే కారణం మీడియా మరియు ప్రేక్షకులు. ఈ సినిమా నా ఒక్కడిదే కాదు. సినిమా మీద ఉన్న ఇష్టంతో సినిమా కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన ప్రజల డబ్బుతో అలాగే నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. ప్రేక్షకులు సినిమాలో కంటెంట్ ఉంటే కచ్చితంగా సక్సెస్ చేస్తారని నమ్ముతాను. సినిమా ద్వారా చాలా మందికి ఎంప్లాయిమెంట్ కూడా దొరుకుతుంది. అంతేకాకుండా వచ్చిన బడ్జెట్ సరిపోనప్పుడు కథ నచ్చి నన్ను నమ్మి సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి ఈరోజు రామానాయుడు స్టూడియోలో మూవీ ఓపెనింగ్ ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి తీసుకువచ్చిన నిర్మాత రాహుల్ త్రిశూల్ గారికి కృతజ్ఞతలు. కష్ట సమయంలో వచ్చి సపోర్ట్ ఇచ్చారు. 100% సినిమా సక్సెస్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. అదేవిధంగా సినిమాలతో బిజీగా ఉండి కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం గారికి దర్శకుడు సముద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామ‌న్నారు.


life.jpg

నిర్మాత రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ : గతంలో నేను రాంగోపాల్ వర్మ సినిమా కథని ఓటిటి కి చేశాను. యాంకర్ రవి హీరోగా రాయలసీమ ప్రేమ కథ అని రెండు సినిమాలు నిర్మించాను. నిర్మాతగా ఇది నాకు మూడవ సినిమా. మహేష్ నాకు రాయలసీమ ప్రేమ కథ అప్పుడు పరిచయం. ఈ సినిమా గురించి మహేష్ చెప్పినప్పుడు కథ నచ్చి ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేసి నేను కూడా ఒక భాగమయ్యాను. ప్రేక్షకులు ఎప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఆదరించి సక్సెస్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఆగస్టు 2nd స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 2md వరకు సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా బిజీగా ఉండి కూడా అడగగానే సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం గారికి దర్శకుడు సముద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మహేష్ కి రాహుల్ త్రిశూల్ కి ధన్యవాదాలు. రాయలసీమ నుంచి వచ్చిన ఎంతోమంది సక్సెస్ అయ్యారు అదేవిధంగా మహేష్ కూడా హీరోగా దర్శకుడిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గతంలో 5 సినిమాలు హీరోగా చేశాడు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో మరియు రాహుల్ త్రిశూల్ నిర్మాత వస్తున్న ఈ స్కూల్ లైఫ్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ప్రేక్షకుల విజయంగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు రామ్ మాట్లాడుతూ.. నేను గతంలో ఏపీ 04 రామాపురం అనే సినిమాలో నటించాను. ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమాలో ఒక మంచి లీడ్ రోల్ లో నటిస్తున్నాను. మహేష్ ఈ సినిమా కథ చెప్పగానే నచ్చి చేయడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు మహేష్ గారికి కృతజ్ఞతలు. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం గారికి దర్శకుడు సముద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అన్నారు. హీరోయిన్ సావిత్రి కృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మహేష్ గారికి కృతజ్ఞతలు. ఈ రోజుల్లో సినిమాలకి కంటెంట్ ఇంపార్టెంట్. అలాంటి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా స్కూల్ లైఫ్. కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈవెంట్ కొచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన హీరో కిరణ్ అపవరం గారికి దర్శకుడు సముద్ర గారికి కృతజ్ఞతలని అన్నారు.

Updated Date - Jul 21 , 2024 | 09:08 PM